ముంబై, బెంగళూరు మ్యాచ్‌.. ఫైనల్‌గా జెర్సీ మార్చేసిన స్టార్‌ హీరోయిన్‌ | Kareena Kapoor Remove MI Jersey After Team Lost | Sakshi
Sakshi News home page

ముంబై, బెంగళూరు మ్యాచ్‌.. ఫైనల్‌గా జెర్సీ మార్చేసిన స్టార్‌ హీరోయిన్‌

Apr 13 2026 12:07 PM | Updated on Apr 13 2026 12:49 PM

Kareena Kapoor Remove MI Jersey After Team Lost

బాలీవుడ్ నటి కరీనా కపూర్  ఆదివారం సాయంత్రం తన కుటుంబంతో కలిసి వాంఖడే స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు.   తన భర్త సైఫ్ అలీ ఖాన్,  కుమారులు తైమూర్, జహంగీర్‌లతో పాటు కరీనా కూడా ముంబై జట్టు జెర్సీ ధరించి మద్ధతిచ్చారు. కుటుంబంతో కలిసి రావడంతో వారి వీడియోలు వైరల్‌ అయ్యాయి. అయితే, ఈ క్రమంలో ఆమెపై ట్రోల్స్‌ కూడా రావడం విశేషం.

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను బెంగళూరు జట్టు మట్టికరిపించింది. మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు కరీనా తన ఫ్యామిలీతో  స్టేడియం బయట సందడిగా కనిపించారు, ఆ తర్వాత స్టాండ్స్‌లో కూర్చుని ఆటను ఆస్వాదిస్తూ కనిపించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత బయలుదేరి వెళ్తున్న సమయంలో మరిన్ని వీడియోలు వైరల్‌ అయ్యాయి. అయితే, ఒక ప్రత్యేకమైన క్లిప్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. 

ఆ వీడియోలో, కరీనా అంతకుముందు మ్యాచ్ సమయంలో ధరించిన ముంబై ఇండియన్స్ జెర్సీకి బదులుగా, ఒక  తెల్లటి టీ-షర్టు ధరించి కనిపించింది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ముంబై ఇండియన్స్ ఓటమి చవిచూసిన తర్వాత, ఈ దృశ్యం ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. ముంబై జట్టు ఓడిపోయన తర్వాత ఆమె తన జెర్సీని తొలగించేశారని తెలుస్తోంది. దీంతో ఆమెను నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement