కోహ్లీకి ఎదురుప‌డితే ఈసారి దబిడిదిబిడే! | What-Happen If Kohli-Travis Head Face to Face In Play-offs Or Final | Sakshi
Sakshi News home page

కోహ్లీకి ఎదురుప‌డితే ఈసారి దబిడిదిబిడే!

May 23 2026 6:19 PM | Updated on May 23 2026 6:55 PM

What-Happen If Kohli-Travis Head Face to Face In Play-offs Or Final

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో శుక్ర‌వారం ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 55 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే మ్యాచ్ విజ‌యం క‌న్నా విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మ‌ధ్య చోటు చేసుకున్న వాగ్వాదం మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ స‌మ‌యంలోనే ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది. 

మ్యాచ్ ముగిసిన త‌ర్వాత హెడ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వ‌డానికి కోహ్లీ నిరాక‌రించ‌డంతో వివాదం మ‌రో మ‌లుపుకు తిరిగింది. వివాదం జ‌రిగి ఒక‌రోజు కావొస్తున్నా ఇంకా ఆ వేడి త‌గ్గ‌లేదనిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఒక ఆస‌క్తిక‌ర ప‌రిణామం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. 

అదేంటంటే.. ఇప్ప‌టికే ప్లేఆఫ్స్ చేరిన ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్‌లు క్వాలిఫ‌య‌ర్‌లో ఎదురుప‌డే అవ‌కాశం లేదు. కానీ క్వాలిఫ‌య‌ర్‌-1 పోరులో ఆర్సీబీ ఓడి, ఎలిమినేట‌ర్ పోరులో ఎస్ఆర్‌హెచ్ గెలిస్తే మాత్రం.. క్వాలిఫ‌య‌ర్‌-2 పోరులో ఈ రెండు జ‌ట్లు మ‌ళ్లీ త‌ల‌ప‌డ‌నున్నాయి.

అలా కాకుండా క్వాలిఫ‌య‌ర్‌-1లో ఆర్సీబీ గెలిచి.. మ‌రోవైపు ఎలిమినేట‌ర్‌తో పాటు క్వాలిఫ‌య‌ర్‌-2లోనూ ఎస్ఆర్‌హెచ్ గెలిచి ఫైన‌ల్ చేరితే మాత్రం, తుది పోరులో ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఏది ఏమైనప్ప‌టికీ కోహ్లీ మాత్రం ప్ర‌తీకారేచ్చ‌తో ర‌గిలిపోతున్నాడు. మ‌రోమారు ఎస్ఆర్‌హెచ్‌తో ఆర్సీబీ మ్యాచ్ ఆడితే మాత్రం హెడ్‌కు ద‌బిడిదిబిడి అయ్యేలాగే ప‌రిస్థితులు ఉన్న‌ట్లు అభిమానులు పేర్కొంటున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో. 

అస‌లేం జ‌రిగిందంటే..
ఆర్సీబీ ఇన్నింగ్స్ స‌మ‌యంలో కోహ్లీ స్లోగా ఆడ‌డంతో హెడ్ @కాస్త బౌండ‌రీలు కొట్టు* అంటూ కాస్త వెట‌కారంగా పేర్కొన్నాడు. దీంతో కోహ్లీకి చిర్రెత్తుకొచ్చి 'నువ్వు బౌలింగ్ చెయ్యు.. బౌండ‌రీలు కొడుతా. అయినా నువ్వు ఎప్పుడు ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గానే వ‌స్తున్నావు. ఒక్క‌సారి బౌలింగ్ కూడా రాలేదు' అని పేర్కొన్నాడు. కానీ హెడ్ మాత్రం కోహ్లీ వ్యాఖ్య‌ల‌ను ప‌ట్టించుకోకుండా స‌ర‌దాగా న‌వ్వేశాడు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత హెడ్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వ‌డానికి నిరాక‌రించ‌డంతో కోహ్లీ దీనిని సీరియ‌స్‌గా తీసుకున్నాడ‌ని  స్ప‌ష్టంగా తెలిసొచ్చింది.

చదవండి: అభిమానికి రోహిత్ క్ష‌మాప‌ణ‌.. ఎందుకంటే?

Advertisement
 
Advertisement
Advertisement