ఐపీఎల్ 2026 సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్, ఆర్సీబీ మ్యాచ్ ఫలితం కంటే విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్‌ల మధ్య చోటుచేసుకున్న వివాదమే హైలైట్‌గా నిలిచింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీపై హెడ్ వ్యంగ్యాస్త్రాలు సంధించడం, దీనికి కౌంటర్‌గా కోహ్లీ ధీటుగా బదులివ్వడం కనిపించింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించినా కోహ్లీ అతడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవడంతో వివాదం మరో మలుపుకు తిరిగింది. అయితే వివాదం అక్కడితో సద్దుమణిగిందిలే అనకుంటే ఇప్పుడు అభిమానులు దీనిని మరింత పెద్దదిగా చేస్తున్నారనిపిస్తోంది.
తాజాగా హెడ్ భార్య జెస్సికాను ఈ వివాదంలోకి లాగారు. జెస్సీకా సోషల్ మీడియా అకౌంట్‌ను హ్యాక్ చేసిన కొంతమంది ఆమెను కించపరుస్తూ అసభ్యకర పోస్టులతో ఆన్‌లైన్ వేధింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు వివాదాన్ని మైదానానికే పరిమితం చేస్తున్నప్పటికీ కొంతమంది ఫ్యాన్స్ మాత్రం వివాదాలను ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలతో ముడిపెట్టి తమ వికృత చేష్టలతో క్రీడా సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నారు.
తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ హెడ్ భార్య జెస్సికా స్వయంగా సోషల్ మీడియా వేదికగా వాపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 'ప్రపంచకప్ సంఘటన తర్వాత నాపై వేధింపులు తిరిగి పునరావృతమైనట్లుగా అనిపిస్తోంది. నేను నిద్రలేవడంతోనే నా సోషల్ మీడియా ఖాతాలో కొంతమంది అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెట్టారు.
నన్ను వేధింపులకు గురి చేసినా పట్టించుకునే దాన్ని కాదు, కానీ వాళ్లు శ్రుతి మించిపోయారు. నాతో పాటు నా కుటుంబసభ్యులను, మిత్రులపై వేధింపులకు దిగారు. క్రీడా సంబంధిత విషయాలను వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టడం సరికాదు. ఈ వికృత చేష్టలను దయచేసి ఆపాలని కోరుతున్నా.' అంటూ జెస్సికా ఆవేదనతో రాసుకొచ్చింది.
మేము మనుషులమే..
'ప్రస్తుతం అన్ని క్రీడల్లోనూ మానసిక ఆరోగ్యం, దృక్పథం, మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానం గురించి ఒక ముఖ్యమైన చర్చ జరుగుతోందని నేను అనుకుంటున్నాను. క్రీడల్లో ఆటగాళ్ల మధ్య గొడవలు సహజం. కానీ ఆటను ఆటగానే చూడాలి. అంతేకానీ ఆ వివాదాలను వ్యక్తుల కుటుంబాల దాకా తీసుకురాకూడదు. మేము మనుషులమే.. మాకు కుటుంబాలు ఉంటాయని గుర్తుంచుకోవడం ముఖ్యం.' అని ఆమె అన్నారు.
గతంలోనూ వేధింపులు..
అయితే హెడ్ భార్య జెస్సికాకు ఆన్‌లైన్ వేధింపులు కొత్త కాదు. గతంలో 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఫైనల్లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను హెడ్ అందుకున్నాడు. అప్పుడు కూడా హెడ్‌తో పాటు అతడి భార్య జెస్సికాను టార్గెట్ చేస్తూ కొంతమంది అభిమానులు అసభ్యకర కామెంట్లు చేశారు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్‌లో కోహ్లీ, హెడ్ మధ్య వివాదం జెస్సికాకు మరోసారి చేదు అనుభవాన్ని మిగిల్చింది.
కోహ్లీ, హెడ్ వివాదమేంటి?
ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీ స్లోగా ఆడడంతో హెడ్.. ‘కాస్త బౌండరీలు కొట్టు’ అంటూ కాస్త వెటకారంగా పేర్కొన్నాడు. దీంతో కోహ్లీకి చిర్రెత్తుకొచ్చి 'నువ్వు బౌలింగ్ చెయ్యు.. బౌండరీలు కొడుతా. అయినా నువ్వు ఎప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్‌గానే వస్తున్నావు. ఒక్కసారి బౌలింగ్ కూడా రాలేదు' అని పేర్కొన్నాడు. కానీ హెడ్ మాత్రం కోహ్లీ వ్యాఖ్యలను పట్టించుకోకుండా సరదాగా నవ్వేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్ల కరచాలనం సందర్భంగా హెడ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ కోహ్లీ అతడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో లీగ్ దశ ముగిసింది. మంగళవారం తొలి క్వాలిఫయర్‌లో ఆర్సీబీ, గుజరాత్ తలపడునున్నాయి. బుధవారం ఎలిమినేటర్‌లో ఎస్ఆర్‌హెచ్, రాజస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మే 29న క్వాలిఫయర్-2, మే 31న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Look behind the whole SRH coaching staff, including Daniel Vettori and Muttiah Muralitharan, were watching Virat Kohli and Travis Head, expecting some drama and ready to stop a fight. 😳
But Kohli didn’t shake hands, and everyone started laughing. 😂 pic.twitter.com/9F9pHwiC8T— Jeet (@JeetN25) May 23, 2026
255 on the board and the bowlers made sure it was never, ever in doubt 🔥#SRH cap off the league stage with a massive 5️⃣5️⃣-run win 🧡
Scorecard ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/LiQBSJDDR2— IndianPremierLeague (@IPL) May 22, 2026


