Photo Courtesy: IPL 2026
ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఫైనల్లో ఇప్పటికైతే ఆర్సీబీదే పైచేయిగా ఉంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతున్న గుజరాత్ టైటాన్స్ సాధారణ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. అయితే గుజరాత్ వికెట్లు పడిన ప్రతీసారి కోహ్లీ హైపర్ యాక్టివ్‌గా కనిపించాడు.
ముఖ్యంగా గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ వికెట్లు పడ్డప్పుడు కోహ్లీ ఇచ్చిన రియాక్షన్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో గిల్ ఔటైన వెంటనే పిచ్‌పైకి పరిగెత్తుకొచ్చిన కోహ్లి గిల్‌వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకోవడం కనిపించింది. అంతటితో ఆగకుండా సాయి సుదర్శన్ ఔట్ కావడానికి ముందు కోహ్లీ శ్రుతి మించిపోయాడు.
హాజిల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లు ప్రతీ బంతికి ముందు కోహ్లీ సాయి సుదర్శన్‌ను టార్గెట్ చేస్తూ ఏదో ఒక మాట అనడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. అదే ఓవర్ నాలుగో బంతికి సాయి సుదర్శన్ భారీ షాట్‌కు యత్నించి జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే కోహ్లీ చర్యలపై గుజరాత్ టైటాన్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ ఇంకా అయిపోలేదు. అని కామెంట్లు పెడుతున్నారు.
మరో విషయమేంటంటే.. గత రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్‌గా వెనుదిరిగిన సాయి సుదర్శన్ ఈ మ్యాచ్‌లోనూ అలా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. హాజిల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ రెండో బంతిని ఆడే క్రమంలో బ్యాట్ అతని చేతి నుంచి జారిపోయేలా కనిపించినప్పటికీ ఈసారి మాత్రం అలా జరగలేదు.
ఇక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాష్టింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రసిక్ సలామ్ మూడు వికెట్లు తీయగా, హాజిల్‌వుడ్, భువనేశ్వర్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టారు.
— crictalk (@crictalk7) May 31, 2026


