ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గొడవలో అయినా, ఫన్నీ మోడ్‌లో అయినా కింగ్ కోహ్లిని ఎవరు బీట్ చేయలేరు. మ్యాచ్‌లో కోహ్లి 25 బంతుల్లోనే 43 పరుగులు చేసి ఆర్సీబీకి శుభారంభం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు.
మ్యాచ్ ఓటమి తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు ఫొటో సెషన్ జరిగింది. ఈ సమయంలో డగౌట్‌లో ఉన్న కోహ్లీ గుజరాత్ జట్టు వైపు చూస్తూ.. ‘ బాగైంది.. మేం మీపై గెలిచి ఫైనల్‌కు చేరుకున్నాంలే’ అంటూ ఫన్నీ మోడ్‌లో తన చేతులతో స్నేక్ గెచ్చర్ ఇవ్వడం కనిపించింది. ఇది చూసిన గుజరాత్ ఆటగాళ్లు సరదాగా నవ్వుకున్నారు.
అంతకముందు గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలోనూ కోహ్లీ గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కయ్యానికి కాలు దువ్వడం కనిపించింది. అయితే ఇదంతా సరదా కోసమే చేసినట్లు వీడియోలో క్లియర్‌గా కనిపించింది. ఇక జాకబ్ డఫీకి బంతి ఇవ్వడానికి ముందు కోహ్లీ చేసిన మరొక చర్య కూడా వైరల్‌గా మారింది.
తాను బౌలింగ్‌కు దిగుతున్నట్లు అంపైర్ వద్దకు వెళ్లి తన క్యాప్‌ను ఇచ్చిన కోహ్లీ ఆ తర్వాత బంతి తీసుకొని రనప్‌కు సిద్ధమయ్యాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన జాకబ్ డఫీ బంతి ఇవ్వమని అడగడంతో అతని చేతిలో పెట్టాడు. ఆ తర్వాత తన క్యాప్ ఇవ్వాలంటూ అంపైర్ వద్దకు వెళ్లగా, అతడు నిరాకరించాడు. దీంతో 'ప్లీజ్ నా క్యాప్ ఇచ్చేయండి' అని అంపైర్‌ను అడగడం వీడియోలో కనిపించింది. గుజరాత్‌పై విజయం తర్వాత భార్య అనుష్క శర్మ దగ్గరికి వెళ్లి హగ్ చేసుకోవడం కనిపించింది.
ఇలా మ్యాచ్ మొత్తం తన చర్యలతో కోహ్లీ హల్‌చల్ చేశాడు. ఇవన్నీ కోహ్లీ సరదాతో చేసినప్పటికీ సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు మాత్రం అతడి చర్యను తప్పుబట్టారు. కోహ్లికి వెటకారం అనుకున్నదాని కంటే ఎక్కువే ఉందని కామెంట్లు పెట్టారు. మొన్న హెడ్‌తో గొడవ పెట్టుకున్న కోహ్లి ఇవాళ గుజరాత్ టీమ్‌ను హేళన చేసేలా అతడి స్నేక్ గెచ్చర్ ఉందని పేర్కొన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్–1లో ఆర్‌సీబీ 92 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది.
Virat Kohli teasing Gujarat Titans players during their photoshoot in Dharamshala 🤣🔥
- Rajat Patidar did the same with GT too 😭 pic.twitter.com/368X6y0VpA— Jara (@JARA_Memer) May 26, 2026


