అందుకే చేజింగ్ మాస్ట‌ర్ అనేది! | IPL 2026 RCB Vs SRH, Virat Kohli Becomes 1st Player To Score Most Runs In IPL Chases, Check Out Record Details Inside | Sakshi
Sakshi News home page

Virat Kohli: అందుకే చేజింగ్ మాస్ట‌ర్ అనేది!

Mar 29 2026 8:30 AM | Updated on Mar 29 2026 11:19 AM

Virat Kohli Becomes 1st Player Most Runs In IPL Chases

విరాట్‌ కోహ్లీ (Courtesy: IPL 2026)

ఐపీఎల్ 2026 సీజ‌న్ ఆరంభ మ్యాచ్‌లోనే ప‌లు రికార్డులు బ‌ద్ద‌ల‌య్యాయి. డిఫెండింగ్ చాంపియ‌న్ హోదాలో బ‌రిలోకి దిగిన రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) అస‌లైన చాంపియ‌న్ ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించి స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌)పై సునాయాస విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. ఎస్ఆర్‌హెచ్ విధించిన 202 ప‌రుగుల టార్గెట్‌ను ఉఫ్ అని ఉదేసింది.  

ప‌డిక్క‌ల్‌, ప‌టిదార్‌లు మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆక‌ట్టుకుంటే..  కోహ్లీ మాత్రం ల‌క్ష్య ఛేద‌న‌లో తన‌ను మాస్ట‌ర్ అని ఎందుకు పిలుస్తారో మ‌రోసారి నిరూపించాడు.  చేజింగ్ అంటేనే కోహ్లీలో ఎక్క‌డ‌లేని ఊపు క‌నిపిస్తుంది. అందుకేనేమో ఈ చేజింగ్ మాస్ట‌ర్‌ను వెతుక్కుంటూ రికార్డులు వ‌స్తుంటాయి. తాజాగా ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లోనూ కోహ్లీ రెండు అరుదైన రికార్డులు అందుకున్నాడు. 

ఐపీఎల్‌లో ల‌క్ష్య ఛేద‌న స‌మ‌యంలో అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా కోహ్లీ రికార్డుల‌కెక్కాడు. 4027 ప‌రుగుల‌తో కోహ్లీ అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్నాడు. కోహ్లీ త‌ర్వాత వార్న‌ర్ (3,285), రోహిత్ శ‌ర్మ (3,238), శిఖ‌ర్ ధావ‌న్ (2,843), రాబిన్ ఊత‌ప్ప (2,832) వ‌రుస‌గా ఉన్నారు. ఎస్ఆర్‌హెచ్‌తో గ‌త ఐదు మ్యాచ్‌ల్లో వ‌రుస‌గా 100, 42, 51, 43, 69* ప‌రుగులు చేయ‌డం ద్వారా మ‌రో రికార్డు లిఖించుకున్నాడు. 

మరిన్ని రికార్డులు..

  • ఇక కోహ్లీకి వ‌రుస‌గా రెండో ఐపీఎల్ సీజ‌న్‌ను కూడా అర్థ‌సెంచ‌రీతోనే మొదలుపెట్టాడు. 2025 సీజ‌న్‌లో కేకేఆర్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో అర్థ‌సెంచ‌రీ చేశాడు. తాజాగా ఎస్ఆర్‌హెచ్‌పై అర్థ‌సెంచ‌రీతో ఈ సీజ‌న్‌లో బ్యాటింగ్‌ను షురూ చేశాడు.

  • ఇక ఐపీఎల్‌లో 200 ప‌రుగులకు పైగా ఛేద‌న‌ను అతి త‌క్కువ ఓవ‌ర్ల‌లో చేధించిన జ‌ట్టుగాను ఆర్సీబీ రికార్డు అందుకుంది. ఎస్ఆర్‌హెచ్ విధించిన 202 ప‌రుగులు ల‌క్ష్యాన్ని 15.4 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. అంత‌క‌ముందు 2025 సీజ‌న్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ల‌క్ష్యాన్ని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 15.5 ఓవ‌ర్ల‌లో అందుకుంది.

  • ఐపీఎల్‌లో 200ల‌కు పైగా ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆర్సీబీ ఛేదించ‌డం ఇది నాలుగోసారి. గ‌తంలో 2025లో ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌పై, 2010లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై, 2024లో గుజ‌రాత్ టైటాన్స్‌పై 200 ప్ల‌స్ స్కోర్లు ఛేదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement