బీసీసీఐ ప్రాపర్టీని నాశనం చేసిన ఆర్సీబీ బ్యాటర్‌! | Tim David Nearly Destroys BCCI Property After RCB Victory | Sakshi
Sakshi News home page

బీసీసీఐ ప్రాపర్టీని నాశనం చేసిన ఆర్సీబీ బ్యాటర్‌!

Jun 1 2026 6:37 PM | Updated on Jun 1 2026 8:03 PM

Tim David Nearly Destroys BCCI Property After RCB Victory

ఐపీఎల్ 2026 సీజన్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా రెండోసారి టైటిల్‌ను నిలబెట్టుకుంది. అయితే ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్ బీసీసీఐ ప్రాపర్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించడం వైరల్‌గా మారింది. అయితే టిమ్‌ డేవిడ్‌ ఇదంతా ఫన్‌ మోడ్‌లో చేయడంతో పెద్దగా వివాదం కాలేదు.

విషయంలోకి వెళితే.. ఈ సీజన్‌లో బీసీసీఐ ఏఐ రోబోట్ చంపాక్‌ను పరిచయం చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు బంతిని తీసుకురావడం, బ్యాటర్లకు వెల్‌కమ్ చెప్పడం లాంటి పనులతో రోబో బాగా పాపులర్ అయింది. అయితే ఈ ఏఐ రోబోను టిమ్ డేవిడ్ నాశనం చేసినంత పని చేశాడు. మ్యాచ్ విజయం అనంతరం ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్‌తో చాంపియన్ ఫొటోలకు ఫోజిచ్చేందుకు వచ్చింది. 

ఈ సమయంలో టిమ్ డేవిడ్ చాంపియన్ అని రాసి ఉన్న బోర్డు నుంచి బయటకు వచ్చి ఏఐ రోబో చంపాక్‌ను తన్నాలని చూశాడు. కానీ తన ఆలోచనను విరమించుకొని తిరిగి తన స్థానానికి వెళ్లిపోయాడు. టిమ్ డేవిడ్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. వాషింగ్ట‌న్ సుంద‌ర్ (50) అర్థ‌సెంచ‌రీతో రాణించాడు. 

ఆర్సీబీ బౌల‌ర్ల‌లో ర‌సిక్ స‌లామ్ 3 వికెట్లు తీయ‌గా, భువ‌నేశ్వ‌ర్‌, హాజిల్‌వుడ్ చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. అనంత‌రం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18 ఓవ‌ర్ల‌లోనే 5 వికెట్లు కోల్పోయి 161 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. కోహ్లీ (75 నాటౌట్‌) అజేయ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీని గెలిపించ‌గా, వెంక‌టేశ్ అయ్య‌ర్ (32), టిమ్ డేవిడ్ (24) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ రెండు వికెట్లు తీయ‌గా, సిరాజ్‌, ర‌బాడ‌లు చెరొక వికెట్ తీశారు.

చదవండి: IPL 2026: టాప్‌-10 వివాదాలపై ఒక లుక్కేద్దామా!

Advertisement
 
Advertisement
Advertisement