రోహిత్ శర్మ- భువనేశ్వర్ కుమార్(PC: Twitter)
IND vs WI: Angry Rohit Sharma kicks ball: రోహిత్ శర్మ.. టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత వరుసగా విజయాలు సాధిస్తున్నాడు. స్వదేశంలో ఇప్పటికే న్యూజిలాండ్‌తో టీ20, వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లు గెలిచాడు. ఇక విండీస్‌తో శుక్రవారం నాటి రెండో టీ20లో భారత్ విజయంతో ఈ సంఖ్య మూడుకు చేరింది. కాగా జట్టు ఎంపిక, తుదిజట్టు కూర్పు తదితర అంశాల్లో కచ్చితంగా వ్యవహరిస్తున్న హిట్‌మ్యాన్... మైదానంలో కూడా దూకుడుగా ఉంటున్నాడు.
ఆటగాళ్లు చిన్న చిన్న తప్పిదాలు చేసినా అస్సలు సహించడం లేదు. సీరియస్‌గా ఉంటూ అక్కడిక్కడే వార్నింగ్‌లు ఇస్తున్నాడు. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్నపుడు యజువేంద్ర చహల్ సరైన స్థానంలో నిల్చోలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్ శర్మ... రెండో టీ20 మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ తీరుపై కూడా అసహనం ప్రదర్శించాడు.
ఈ మ్యాచ్‌లో విండీస్ బ్యాటర్లు నికోలస్ పూరన్, పావెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియాను బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 15వ ఓవర్ బౌల్ చేసిన భువీ... ఆఖరి బంతికి పావెల్ ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచాడు. దీంతో ఆగ్రహానికి గురైన రోహిత్ శర్మ కోపంతో బంతిని తన్ని అసహనం ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ క్రమంలో.. ‘‘మరీ అంత కోపమా రోహిత్.. బంతిని ఎందుకలా తన్నావు.. పాపం భువీ!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన రెండో టీ20లో రోహిత్ సేన 8 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భువీ.. ప్రమాదకర బ్యాటర్ నికోలస్ పూరన్ వికెట్ తీసి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు.
చదవండి: Ind Vs Wi 3rd T20: మూడో టీ20కి స్టార్ ప్లేయర్లు దూరం... మరో కీలక సిరీస్‌కు కూడా డౌటే.. ఎందుకంటే!
🙌🙌#TeamIndia @Paytm #INDvWI pic.twitter.com/NjrkDCxt2q
— BCCI (@BCCI) February 18, 2022
— Addicric (@addicric) February 18, 2022
Comments
Please login to add a commentAdd a comment