క్రికెటర్ భువనేశ్వర్కు బెదిరింపులు | Cricketer receives life threats in Meerut | Sakshi
Sakshi News home page

క్రికెటర్ భువనేశ్వర్కు బెదిరింపులు

Published Sun, Aug 9 2015 6:39 PM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM

క్రికెటర్ భువనేశ్వర్కు బెదిరింపులు - Sakshi

క్రికెటర్ భువనేశ్వర్కు బెదిరింపులు

మీరట్: భారత యువ పేసర్ భువనేశ్వర్ కుమార్,  ఆయన తండ్రి కిరణ్ పాల్ సింగ్లకు బెదిరింపులు వచ్చాయి. కిరణ్ పాల్ ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ భూవివాద విషయంపై భువనేశ్వర్, కిరణ్ పాల్ కు బెదిరింపులు వచ్చినట్టు మీరట్ పోలీసులు తెలిపారు. భువనేశ్వర్ కుటుంబం ఉత్తరప్రదేశ్లోని మీరట్లో నివసిస్తోంది.

 కిరణ్పాల్.. బులంద్షార్ జిల్లా నివాసి రణవీర్ సింగ్ నుంచి 80 లక్షల రూపాయలకు భూమిని కొనుగోలు చేశారు. రణవీర్ ఓ హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. కిరణ్ పాల్ భూమి కొనుగోలుకు సంబంధించిన మొత్తాన్ని నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. అయితే రణవీర్ భూమిని కిరణ్పాల్ పేరిట ట్రాన్స్ఫర్ చేయలేదు.  రణవీర్ ఈ డబ్బును తిరిగి ఇచ్చేందుకు నిరాకరించడంతో పాటు భువనేశ్వర్, కిరణ్పాల్ను బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. రణవీర్తో పాటు మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. భువనేశ్వర్ ప్రస్తుతం టీమిండియాతో పాటు శ్రీలంకలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement