
పుణే: భారత్‌తో జరుగుతోన్న రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టు మరో రెండు కీలక వికెట్లను కోల్పోయింది. పరుగుల కోసం కివీస్ ఆటగాళ్లు చెమటోడ్చుతున్నారు. ముంబయిలో జరిగిన తొలివన్డేలో శతకంతో చెలరేగి భారత్ ఓటమిని శాసించిన టామ్ లాథమ్ (38)ను టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. దీంతో కివీస్ సగం వికెట్లు కోల్పోయింది. కుల్‌దీప్ యాదవ్ స్థానంలో జట్టులోకొచ్చిన అక్షర్ పటేల్ కీలక వికెట్ ను జట్టుకు అందించాడు. లాథమ్ నికోల్స్ జోడీ ఐదో వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యం అందించాక లాథమ్ ను అక్సర్ పటేల్ పెవిలియన్ బాట పట్టించాడు.
భువీ మరోసారి అద్భుతం!
లాథమ్ ఔటయ్యాక నికోల్స్ (62 బంతుల్లో 42), డి గ్రాండ్ హోమ్మి(36) కివీస్ స్కోరులో వేగం పెంచారు. యితే కివీస్ ఓపెనర్లను ఔట్ చేసిన భారత స్టార్ పేసర్ భువీ బంతితో మరోసారి అద్భుతం చేశాడు. ఈ జోడీ ఆరో వికెట్ కు 47 పరుగులు జోడించాక క్రీజులో కుదుర్చుకున్న నికోల్స్ (42)ను ఓ లెంగ్త్ బంతితో బౌల్డ్ చేయగానే భారత జట్టులో ఆనందం వెల్లివిరిసింది. 42 ఓవర్లు ముగిసేసరికి కివీస్ 6 వికెట్లు కోల్సోయి 176 పరుగులు చేసింది. భువీ 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment