Bhuvneshwar Kumar Became Father Couple Welcome Their First Child - Sakshi
Sakshi News home page

Bhuvneshwar Kumar: తండ్రైన టీమిండియా క్రికెటర్‌.. పెళ్లిరోజు తర్వాతి నాడే..

Published Wed, Nov 24 2021 3:01 PM | Last Updated on Wed, Nov 24 2021 4:13 PM

Bhuvneshwar Kumar Became Father Couple Welcome Their First Child - Sakshi

Bhuvneshwar Kumar Became Father Couple Welcome Their First Child: టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఇంట ఆనందాలు వెల్లివిరిశాయి. అతడి భార్య నుపుర్‌ నగర్‌ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాగా తమ నాలుగో వివాహ వార్షికోత్సవం పూర్తి చేసుకున్న మరుసటి రోజే భువీ- నుపుర్‌ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందడం విశేషం. నుపుర్‌కు మంగళవారం నొప్పులు రావడంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా నేడు(బుధవారం) ఉదయం తొమ్మిది గంటలకు పాప పుట్టింది. 

ఇక ఇటీవల ముగిసిన ఇండియా- న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌ నేపథ్యంలో ఇంటికి దూరంగా ఉన్న భువీకి ఫోన్‌లో ఈ శుభవార్త చెప్పినట్లు సన్నిహితులు వెల్లడించారు. కాగా భువనేశ్వర్‌- నుపుర్‌ నగర్‌ 2017లో నవంబరు 23న పెళ్లి చేసుకున్నారు. ఇక కివీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భువీ 3 వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీ తర్వాత స్వదేశంలో జరిగిన ఈ సిరీస్‌ను రోహిత్‌ సేన క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: Venkatesh Iyer: ప్రమాదంలో పాండ్యా కెరీర్‌; ఆల్‌రౌండర్‌ను.. ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికైనా సిద్ధం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement