PC: IPL
ఐపీఎల్లో టీమిండియా ఫాస్ట్ బౌలర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో 150 వికెట్లు పడగొట్టిన తొలి భారత పేసర్‌గా బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2022లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్ ఈ ఘనత సాధించిన జాబితాలో ఏడో స్థానంలో భువనేశ్వర్ కుమార్ నిలిచాడు.
ఇక టీమిండియా స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, పీయూష్ చావ్లా, హార్భజన్ సింగ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. కాగా చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ డ్వేన్ బ్రావో 177 వికెట్లతో ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్‌పై 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది.
ఐపీఎల్‌లో 150 వికెట్లు పడగొట్టిన బౌలర్లు
డ్వేన్ బ్రావో 177 వికెట్లు
లసిత్ మలింగా 170 వికెట్లు
అమిత్ మిశ్రా 166 వికెట్లు
పీయూష్ చావ్లా 157 వికెట్లు
యజువేంద్ర చాహల్ 151 వికెట్లు
భువనేశ్వర్ కుమార్ 150 వికెట్లు
Comments
Please login to add a commentAdd a comment