ఆరో వన్డేలో టాస్ వేస్తున్న సఫారీ కెప్టెన్ మర్‌క్రామ్
సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న చివరిదైన ఆరో వన్డేలో భారత్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తొలుత దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు భారీ మార్పులు చేసే అవకాశం ఉందని తొలుత భావించినప్పటికీ, పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు ఒక్కడికే విశ్రాంతినిచ్చారు. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. మరొకవైపు దక్షిణాఫ్రికా రెండు మార్పులతో పోరుకు సిద్దమైంది.జేపీ డుమిని స్థానంలో జాండో జట్టులోకి రాగా, డేవిడ్ మిల్లర్ స్థానంలో బెహర్దియన్‌ను తీసుకున్నారు.
ఇప్పటికే సిరీస్‌ను 4-1తో గెలుచుకున్న టీమిండియా.. చివరి వన్డేలో కూడా విజయం సాధించి సఫారీలకు మరో షాక్ ఇవ్వాలని యోచిస్తోంది. అయితే సఫారీలు ఆఖరి వన్డేలో గెలిచి ఆత్మవిశ్వాసంతో టీ20 సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలనే భావనలో ఉన్నారు. అంతకుముందు ఇదే వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
భారత తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోని, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బూమ్రా, యజ్వేంద్ర చాహల్
దక్షిణాఫ్రికా తుది జట్టు: మర్‌క్రామ్(కెప్టెన్), ఆమ్లా, జాండో, డివిలియర్స్, బెహర్దియన్, క్లాసెన్, ఫెహ్లకోవాయో, రబడా, మోర్నీ మోర్కెల్, షమ్సి, ఎన్‌గిడి
Comments
Please login to add a commentAdd a comment