సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డుల మోత మోగించాడు. ఈ ఆరు వన్డేల సిరీస్‌లో మూడు సెంచరీలు సాధించడం ద్వారా ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన కోహ్లి.. ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో మూడు సెంచరీలు సాధించిన ఏకైక భారత క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. తొలి వన్డేలో శతకం సాధించిన కోహ్లి.. మూడో వన్డేలో కూడా సెంచరీ బాదాడు. ఇక చివరిదైన ఆరో వన్డేలో శతకం నమోదు చేసి కొత్త చరిత్రను లిఖించాడు. అంతకుముందు భారత్ తరపున సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు మాత్రమే ఒక సిరీస్‌లో మూడు సెంచరీలు సాధించారు. అయితే అది ద్వైపాక్షిక సిరీస్‌లో సాధించిన సెంచరీలు కాదు. 2003లో గంగూలీ మూడు శతకాలు చేస్తే, 2004లో జరిగిన వీబీ సిరీస్‌లో లక్ష్మణ్ మూడు సెంచరీలు నమోదు చేశాడు.
మరొకవైపు దక్షిణాఫ్రికాలో జరిగిన ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లి ఘనత సాధించాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ కోహ్లి సాధించిన వన్డే పరుగులు 558.ఇదిలా ఉంచితే, ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో సైతం అత్యధిక పరుగులు సాధించిన ఘనతను కూడా కోహ్లి తన పేరును లిఖించుకున్నాడు. ఆ తర్వాత స్థానంలో రోహిత్ శర్మ (491 పరుగులు) రెండో స్థానంలో ఉండగా, జార్జ్ బెయిలీ(ఇంగ్లండ్-478 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment