35వ వన్డే సెంచరీ సాధించిన తర్వాత కోహ్లి అభివాదం
సెంచూరియన్:దక్షిణాఫ్రికాతో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా చివరిదైన ఆఖరి వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. దాంతో తన వన్డే కెరీర్‌లో 35వ సెంచరీని కోహ్లి సాధించాడు. అదే సమయంలో లక్ష్య ఛేదనలో 21 సెంచరీని కోహ్లి తన ఖాతాలో వేసుకుని ఛేజింగ్ మాస్టర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఆ 21 సెంచరీల్లో 19 శతకాలు భారత జట్టును గెలిపించినవే కావడం ఇక్కడ మరో విశేషం.
ఇదిలా ఉంచితే, ఆరో వన్డే తర్వాత బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన కోహ్లి.. క్రికెట్ వరల్డ్‌కు ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు.' నేను ఇంకా 8 నుంచి 9 ఏళ్ల పాటు క్రికెట్ ఆడే అవకాశం ఉంది. నేను క్రికెట్ ఆటను ఆస్వాదించినంత కాలం ఇదే తరహాలో ఆడతా. నేను ఎక్కువ శాతం దూకుడుగానే ఆడుతూ జట్టు విజయాల్లో పాలు పంచుకుంటా. ఇందుకోసం కఠినమైన శిక్షణ తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నా' అని ప్రపంచంలోని బౌలర్లకు కోహ్లి సవాల్ విసిరాడు. తాను ఆరోగ్యంగా ఫిట్‌గా ఉండటానికి ఆ దేవుని ఆశీర్వాదమే కారణమని ఒక ప్రశ్నకు సమాధానంగా కోహ్లి చెప్పాడు. తన దేశానికి క్రికెట్ ఆడటంతో పాటు కెప్టెన్‌గా ఉండటాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నాడు. తన జట్టు కోసం 120 శాతం కష్టపడతానని కోహ్లి ఉద్వేగపూరితంగా మాట్లాడాడు.
దక్షిణాఫ్రికాతో ఆఖరి వన్డేలో కోహ్లి సెంచరీ సాధించాడు. 96 బంతుల్లో 129 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. దాంతో ఈ వన్డే సిరీస్‌లో మూడో శతకాన్ని సాధించి ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక శతకాలు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లి చరిత్రకెక్కాడు.
Comments
Please login to add a commentAdd a comment