పోర్ట్ ఎలిజబెత్: ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ భారత్‌తో ఆరంభమైన ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచకుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ మర్కరమ్ తొలుత భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, సఫారీ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. క్రిస్ మోరిస్ స్థానంలో షమ్సి తుది జట్టులోకి వచ్చాడు.
ప్రస్తుతం 3–1తో ముందంజలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ సొంతం కావడంతో పాటు నంబర్‌వన్ ర్యాంక్ కూడా ఒక సుస్థిరమవుతుంది. సొంతగడ్డపై సిరీస్ కాపాడుకునే ప్రయత్నంలో గత మ్యాచ్‌లో రాణించిన సఫారీ జట్టు అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తోంది.
పేలవ రికార్డును సవరిస్తారా?
దక్షిణాఫ్రికాలో భారత్‌కు పేలవ రికార్డు ఉన్న మైదానాల్లో ఇక్కడి సెయింట్ జార్జెస్ పార్క్ ఒకటి. 1992 నుంచి ఈ స్టేడియంలో ఐదు వన్డేలు ఆడిన భారత్ అన్నీ ఓడిపోయింది. నాలుగు సార్లు దక్షిణాఫ్రికా చేతిలో పరాజయంపాలు కాగా, ఒకసారి కెన్యా చేతిలోనూ ఓడింది. పైగా టీమ్ అత్యధిక స్కోరు కూడా 176 మాత్రమే. మరి ఇప్పుడు ఆ రికార్డును భారత్ సవరించి గెలుపును అందుకుంటుందా..లేక సిరీస్ ఫలితాన్ని కడవరకూ తీసుకెళుతుందా చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment