తాహీర్ క్యాచ్‌ను షార్ట్ కవర్‌లో అందుకుంటున్న కోహ్లి
సెంచూరియన్: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన క్లబ్‌లో చేరిపోయాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకుని ప్రపంచ క్రికెట్‌లో దూసుకుపోతున్నకోహ్లి.. దక్షిణాఫ్రికాతో చివరిదైన ఆరో వన్డేలో సెంచరీ క్యాచ్‌ల మార్కును చేరాడు. తాజా వన్డేలో రెండు అద్భుతమైన క్యాచ్‌లను పట్టిన కోహ్లి.. వన్డేల్లో వంద క్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత తరపున అత్యధిక క్యాచ్‌లను పట్టిన నాల్గో ఫీల్డర్‌గా సురేశ్ రైనా సరసన చేరాడు.
అంతకుముందు మొహ్మద్ అజహరుద్దీన్ 156 క్యాచ్‌లు(231 వన్డేలు), సచిన్ టెండూల్కర్ 140 క్యాచ్‌లు( 333 వన్డేలు), రాహుల్ ద్రవిడ్ 125 క్యాచ్‌లు( 283 వన్డేలు) అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత ఫీల్డర్లు. ఆ తరువాత రైనా 223 వన్డేల్లో వంద క్యాచ్‌లు పట్టిన ఆటగాడు. అయితే 208 వన్డేల్లో కోహ్లి వంద క్యాచ్‌లను పట్టడం ఇక్కడ విశేషం. ఈ రోజు మ్యాచ్‌లో క్లాసెన్, తాహీర్ క్యాచ్‌లను కోహ్లి అందుకున్నాడు. ఈ రెండు క్యాచ్‌లను బూమ్రా బౌలింగ్‌లోనే షార్ట్ కవర్‌లో ఫీల్డింగ్ చేస్తూ కోహ్లి పట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment