
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ టోర్నీ నుంచి తప్పుకుంటే ఇప్పుడు పేసర్ భువనేశ్వర్ కుమార్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. తుంటి గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమైన భువీ.. సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండటం లేదని ఎస్‌ఆర్‌హెచ్ అధికారి ఒకరు ఏఎన్‌ఐకు తెలిపారు. (చదవండి: కెప్టెన్ ఒకటి, కోచ్ మరొకటి అంటే కష్టమే: ధోని)
‘భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్ ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. భువీ తుంటి గాయంతో బాధపడుతున్నాడు. అతడు మా జట్టు పేస్ విభాగంలో కీలకం. కానీ అతడు టోర్నీలో లేకపోవడం కచ్చితంగా మాకు ఎదురుదెబ్బ’ అని సదరు అధికారి తెలిపారు. తొలి మ్యాచ్‌లోనే స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం బారినపడి టోర్నీ మొత్తంకు దూరమయిన విషయం తెలిసిందే. స్టార్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ కూడా గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కావడంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ బలహీనంగా కనిపించింది. ఇప్పుడు భువీ లేకపోవడం ఆ జట్టు పేస్ విభాగంపై ప్రభావం చూపనుంది.(చదవండి: సన్‌రైజర్స్ ‘గాయం’ ఎంతవరకూ..)
Comments
Please login to add a commentAdd a comment