
భువీ షాట్‌కు పాండ్యా విలవిల..
క్రికెట్ ఎంత వినోదాత్మకమో అంతే ప్రమాదకరం.
సాక్షి, కొల్‌కతా: క్రికెట్ ఎంత వినోదాత్మకమో అంతే ప్రమాదకరం. గాయాలతో ఎందరో క్రికెటర్లు తమ ప్రాణాలు సైతం కోల్పోయారు. ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం క్రికెట్ చరిత్రలో ఎంతటి విషాదం నింపిందో అందరికి తెలిసిందే. ఇంచుమించు అలాంటి ఘటనే భారత్- ఆస్ట్రేలియా రెండో వన్డేలో చోటుచేసుకుంది. కానీ ఏవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కౌల్టర్‌నీల్ వేసిన 46 ఓవర్ నాలుగో బంతి టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు తగిలింది.
క్రీజులో బ్యాటింగ్ చేస్తున్న భువనేశ్వర్ స్టేట్ డ్రైవ్ షాట్ నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న పాండ్యా హెల్మెట్ గ్రిల్స్ తగలింది. ఈ దెబ్బకు పాండ్యా విలవిలాడుతూ ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలాడు. వెంటనే ఆసీస్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్, డ్రెస్సింగ్ వైపు సైగ చేస్తూ ఫిజియోకి సమాచారం ఇచ్చాడు. అయితే పాండ్యా మాత్రం రిటైర్డ్ అవుట్ కాకుండా బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ ఘటనతో ప్లేయర్లంతా హతాశులయ్యారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో బెంగాల్ రంజీ క్రికెటర్ ఫీల్డింగ్ చేస్తూ మరో ప్లేయర్‌ను ఢీకొట్టి తీవ్రగాయలతో మృతి చెందిన విషయం తెలిసిందే.