ఆసియాకప్-2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోరులో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. పాండ్యా (33 నాటౌట్)తో పాటు జడేజా(35) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక అంతకుముందు బౌలింగ్‌లో కూడా పాండ్యా అదరగొట్టాడు.
మరోవైపు ఈ మ్యాచ్‌లో పేసర్ భువనేశ్వర్ కుమార్ అధ్బుతమైన ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన భువీ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో పాకిస్తాన్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తన రెండో వికెట్‌గా ఆసిఫ్ అలీను ఔట్ చేసిన అనంతరం భువీ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పటి వరకు పాకిస్తాన్‌పై భువీ 9 వికెట్లు పడగొట్టాడు. కాగా అంతకు ముందు ఈ రికార్డు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్(6 వికెట్లు) పేరిట ఉండేది. ఈ ఘనత సాధించిన జాబితాలో 9 వికెట్లతో భువీ తొలి స్థానంలో ఉండగా.. హార్దిక్ పాండ్యా 7 వికెట్లతో రెండు స్థానంలో ఉన్నాడు.
మ్యాచ్ సంక్షిప్త సమాచారం
టాస్: భారత్ బౌలింగ్
పాకిస్తాన్: 147/10
పాక్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్: మహ్మద్ రిజ్వాన్(42 బంతుల్లో 43 పరుగులు)
భారత బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు, హార్ధిక్ పాండ్యా 3వికెట్లు, అర్షదీప్ సింగ్ 2వికెట్లు
టీమిండియా : 148/5(19.4 ఓవర్లు)
భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్లు: విరాట్ కోహ్లి(35), జడేజా(35)
పాక్ బౌలింగ్: మహ్మద్ నవాజ్ మూడు వికెట్లు, నషీమ్ షా రెండు వికెట్లు
విజేత: 5 వికెట్ల తేడాతో పాక్‌పై టీమిండియా విజయం
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హార్దిక్ పాండ్యా( మూడు వికెట్లతో పాటు 33 పరుగులు (నాటౌట్))
చదవండి: Asia Cup 2022: పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్.. ఉత్కంఠ పోరులో విజయం
Comments
Please login to add a commentAdd a comment