కాన్పూర్: ఇటీవల న్యూజిలాండ్ తో పుణెలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ పై (3/45) అత్యుత్తమ వన్డే బౌలింగ్ గణాంకాలను నమోదు చేసి విజయం కీలక పాత్ర పోషించాడు. తద్వారా వన్డేల్లో నాల్గోసారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్న భువీ.. ఆ అవార్డును న్యూజిలాండ్ పై తొలిసారి అందుకున్నాడు. ఇదిలా ఉంచితే, ఆదివారం న్యూజిలాండ్ తో సిరీస్ నిర్ణయాత్మక వన్డే మ్యాచ్ కు సిద్ధమవుతున్న తరుణంలో భువనేశ్వర్ మాట్లాడుతూ తన బౌలింగ్ సక్సెస్ సీక్రెట్ ఏమిటనేది వెల్లడించాడు.
'బంతిని ఎక్స్ ట్రా పేస్ తో వేస్తున్నప్పుడు కూడా స్వింగ్ ను మాత్రం వదులుకోవడం లేదు. బంతిని అదనపు పేస్ తో సంధించే క్రమంలో స్వింగ్ ను కొనసాగించడంతో వికెట్ల వేటలో సక్సెస్ అవుతున్నా. బంతిని సంధిస్తున్నప్పుడు స్వింగ్ ను వదులుకోకుండా వేయడమే నా సక్సెస్ సీక్రెట్. బౌలింగ్ బాగా వేసే బౌలర్ కు ఎక్కువగా టెక్నిక్ తెలియాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్నచిన్న విషయాలతోనే బౌలింగ్ లో మెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నన్నే ఉదాహరణగా తీసుకోండి. ఒకానొక సమయంలో నా పేస్ బాగా పెరిగింది. కాకపోతే అదే సమయంలో స్వింగ్ ను కోల్పోయాను. అది ఎలా జరిగిందనే విషయం నాకైతే తెలియదు. అయితే కొన్ని సూత్రాలతో మళ్లీ నా స్వింగ్ ను దొరకబుచ్చుకున్నాను. ఎక్స్ ట్రా పేస్ తో కలిసి స్వింగ్ చేయడమే నా సక్సెస్ సీక్రెట్. అందుకు టీమిండియా జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణే కారణం. కొన్ని అమూల్యమైన సలహాలతో నా బౌలింగ్ ను గాడిలో పెట్టారు. నిజంగా భారత జట్టులో అతను పాత్ర చాలా విలువైనది 'అని భువనేశ్వర్ కుమార్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment