Bhuvneshwar Kumar Shared His Daughter First Photo With Wife, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Bhuvneshwar Kumar: భారత జట్టు డాటర్స్‌ లిస్టులో మరో రాకుమారి.. భువీ కూతురు ఫొటో వైరల్‌!

Published Mon, Dec 20 2021 10:52 AM | Last Updated on Mon, Dec 20 2021 11:42 AM

Bhuvneshwar Kumar Shares Daughter Photo For First Time Goes Viral - Sakshi

Bhuvneshwar Kumar Daughter Photo: కెరీర్‌ పరంగా కాస్త వెనుకబడిన టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ప్రస్తుతం కుటుంబానికి సమయం కేటాయించాడు. భార్యాబిడ్డలతో కలిసి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. కూతురు రాకతో తమ ప్రపంచం మొత్తంగా మారిపోయిందంటూ సంబరపడిపోడతున్నాడు. కాగా భువీ భార్య నుపుర్‌ గత నెలలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. నాలుగో పెళ్లిరోజు జరుపుకొన్న మరుసటి రోజే పాపాయి ఈ భూమ్మీదకు రావడంతో వారి సంతోషం రెట్టింపైంది. కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి. 

ఈ క్రమంలో తొలిసారిగా కూతురితో కలిసి ఉన్న ఫొటోను భువీ సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. ఈ క్రమంలో వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా సహా పలువురు భువీ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా భువీ తన గారాల పట్టిని ఎత్తుకుని ఉండగా.. నుపుర్‌ ఆత్మీయంగా ఆమెను చూస్తున్న ఈ చిత్రం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. 

‘‘భారత జట్టు డాటర్స్‌ లిస్టులో మరో రాకుమారి’’ చేరింది అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా టీమిండియా మాజీ సారథి ధోని, ప్రస్తుత పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, టెస్టు సారథి విరాట్‌ కోహ్లి సహా అజింక్య రహానే, పుజారా తదితరులు ఆడపిల్లల తండ్రులన్న సంగతి తెలిసిందే. ఇక మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ నేపథ్యంలో కోహ్లి సారథ్యంలోని టెస్టు జట్టు ఇప్పటికే దక్షిణాఫ్రికా చేరుకున్న సంగతి తెలిసిందే. 

భారత టెస్ట్‌ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్‌ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్

స్టాండ్‌బై ప్లేయర్లు: నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నగ్వాస్‌వాల్లా.

చదవండి: U 19 World Cup 2022: మనోళ్లు ఇద్దరు.. శభాష్‌ రషీద్‌, రిషిత్‌ రెడ్డి!
Vijay Hazare Trophy: ‘యశ్‌’లు అదరగొట్టారు... ఒకరు 4 వికెట్లు తీస్తే.. మరొకరు 57 పరుగులు చేసి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement