దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ బెడింగ్‌హామ్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. సెంచూరియన్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన బెడింగ్ హామ్.. మొదటి ఇన్నింగ్స్‌లో 56 పరుగులతో రాణించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తన ఫేవరేట్ ఇండియన్ క్రికెటర్లు అని బెడింగ్ హామ్ చెప్పుకొచ్చాడు.
అదేవిధంగా తన చిన్నతనం నుంచి దక్షిణాఫ్రికా దిగ్గజాలు జాక్వెస్ కల్లిస్,హెర్షెల్ గిబ్స్‌లను ఆరాధిస్తున్నట్లు బెడింగ్‌హామ్ తెలిపాడు. అయితే తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెడింగ్ హామ్ తనకు ఇష్టమైన భారత ఆటగాళ్ల పేర్లను వెల్లడించాడు.
"విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఇద్దరూ నా ఫేవరేట్ ఇండియన్ క్రికెటర్లు. నేను 13 నుంచి 18 ఏళ్ల మధ్య నా బ్యాటింగ్ టెక్నిక్‌ను మెరుగుపరుచుకోవడానికి జాక్వెస్ కల్లిస్, హెర్షెల్ గిబ్స్‌లను అనుకురించాను. అయితే ఎదైనా మ్యాచ్‌లో నేను విఫలమైతే విరాట్ కోహ్లి బ్యాటింగ్ స్టైల్‌ను కాపీ చేస్తాను.
అప్పటికీ నా ఆటతీరు మారకపోతే రోహిత్ శర్మ బ్యాటింగ్ టెక్నిక్‌ను ఫాలో అవుతాను అని బెడింగ్‌హామ్ పేర్కొన్నాడు. ఇక జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా టీమిండియాతో జరగనున్న రెండో టెస్టు కోసం బెడింగ్‌హామ్ సిద్దమవుతున్నాడు.
చదవండి: డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్.. మార్ష్‌కు ప్రమోషన్! ఏకంగా రూ.6 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment