టీమిండియా వెటరన్ పేసర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన మార్క్‌ను మరోసారి చూపించాడు. ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఐపీఎల్‌లో రెండో సారి ఫైవ్ వికెట్ హాల్ సాధించాడు. భువీ తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
ముఖ్యంగా ఆఖరి ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్ కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. మరో రన్ బైస్ రూపంలో వచ్చింది. ఈ ఓవర్‌లో భువీ మూడు వికెట్లు సాధించాడు. అదే విధంగా ఓ రనౌట్ కూడా చేశాడు. ఓవరాల్‌గా ఆఖరి ఓవర్‌లో గుజరాత్ నాలుగు వికెట్లు కోల్పోయింది.
ఇక టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్‌మన్ గిల్(58 బంతుల్లో 101) సెంచరీతో చెలరేగాడు. ఇక ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లలో భువీతో పాటు నటరాజన్, ఫరూఖీ, జానెసన్ తలా వికెట్ సాధించారు.
చదవండి: వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ధోని ఆడుతాడని గట్టిగా నమ్ముతున్నాం: సీఎస్‌కే సీఈవో
A team hattrick & a 🖐️-wicket haul - this final over was a Bhuvi masterclass!
— JioCinema (@JioCinema) May 15, 2023
#GTvSRH #IPLonJioCinema #TATAIPL #IPL2023 #EveryGameMatters @SunRisers pic.twitter.com/fNkl8KZ3Ea
Comments
Please login to add a commentAdd a comment