
ఆసీస్ టూర్ నుంచి షమీ అవుట్
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి మరోసారి గాయం తిరగబెట్టడంతో అతను ఆసీస్ టూర్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)శనివారం స్పష్టం చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో భాగంగా శుక్రవారం వెస్ట్రన్ ఆస్ట్రేలియా జరిగిన ట్వంటీ 20లో అతని ఎడమ తొడకండరం పట్టేయడంతో ఆసీస్ టూర్ కు పక్కకు పెట్టాల్సి వచ్చిందని బోర్డు తెలిపింది. అతనికి నాలుగు వారాల నుంచి ఆరు వారాల వరకూ విశ్రాంతి అవసరమని పేర్కొంది.
అయితే అతని స్థానంలో భువనేశ్వర్ కుమార్ కు స్థానం కల్పిస్తూ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. భువనేశ్వర్ ఆదివారం నాటికి జట్టుతో కలుస్తాడని పేర్కొంది. అంతకుముందు భువనేశ్వర్ కుమార్ కు ట్వంటీ 20 జట్టులో స్థానం కల్పించినా.. వన్డే జట్టులో చోటు దక్కని సంగతి తెలిసిందే.