న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో తొలి రెండు వన్డేలకు దూరమైన టీమిండియా ప్రధాన పేసర్లు జస్ప్రిత్ బూమ్రా, భువనేశ్వర్ కుమార్‌లు మిగతా మూడు వన్డేలకు అందుబాటులోకి వచ్చారు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి రెండు వన్డేలకు వీరిద్దరికి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. కాగా, గురువారం ప్రకటించిన జట్టులో జస్ప్రిత్ బూమ్రా, భువీలు చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు 15 సభ్యులతో కూడిన జట్టును ప‍్రకటించిన సెలక్టర్లు.. పేసర్ మహ్మద్ షమీకి ఉద్వాసన పలికారు. తొలి రెండు వన్డేల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన షమీని పక్కకు పెడుతూ నిర్ణయం తీసుకున్నారు. తొలి వన్డేలో భారత్ గెలవగా, రెండో వన్డే టైగా ముగిసింది. దాంతో తొలి రెండు వన్డేలు ముగిసే సరికి భారత్ జట్టు 1-0తో ఆధిక్యంలో ఉంది.
మిగతా మూడు వన్డేలకు భారత జట్టు ఇదే..
విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, రిషబ్ పంత్, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజ‍్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, బూమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే
Comments
Please login to add a commentAdd a comment