Bhuvneshwar Kumar: టీమిండియా సీమర్ భువనేశ్వర్ కుమార్ అనూహ్య చర్యతో వార్తల్లో నిలిచాడు. తన సోషల్ మీడియా అకౌంట్ బయోలో మార్పు చేసి ఫాలోవర్లను కన్ఫ్యూజన్‌లోకి నెట్టేశాడు. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన భువీ 2012లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. పేస్ దళంలో ముఖ్యమైన సభ్యుడిగా జట్టుకు సేవలు అందించి ఎన్నో రికార్డులు సాధించాడు.
గడ్డు పరిస్థితులు..
అయితే, గత కొంతకాలంగా ఈ ఫాస్ట్‌బౌలర్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. గతేడాది నవంబరులో చివరిసారిగా టీమిండియా తరఫున ఆడిన 33 ఏళ్ల భువీని సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా నుంచి బీసీసీఐ ఇటీవలే తొలగించింది.
వరుస వైఫల్యాల నేపథ్యంలో ఆసియా కప్ టీ20 టోర్నీ-2022, టీ20 ప్రపంచకప్-2022లో దారుణ ప్రదర్శన తర్వాత బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన భువనేశ్వర్ కుమార్.. దేశవాళీ క్రికెట్‌కు కూడా దూరంగా ఉన్నాడు.
ఇప్పుడే అలాంటి నిర్ణయాలు వద్దు
ఈ నేపథ్యంలో భువీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బయోలో ఇండియన్ క్రికెటర్‌ను ఇండియన్‌గా మార్చుకోవడం విశేషం. ఇది గమనించిన ఫ్యాన్స్.. ‘‘అయ్యో ఇదేంటి భువీ! నువ్వు పునరాగమనం చేస్తావనని మేము బలంగా కోరుకుంటున్నాం. టీమిండియాకు నువ్వు చేయాల్సింది చాలా ఉంది!
ఇదంతా చూస్తుంటే నువ్వు బాగా హర్ట్ అయినట్లు కనిపిస్తోంది. ప్రతి ఆటగాడి జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. నువ్వు మళ్లీ తిరిగి జట్టులోకి రావాలి. ఇప్పుడే రిటైర్మెంట్ లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ప్లీజ్’’ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. కాగా ఇన్‌స్టాలో ఇండియన్ క్రికెటర్ అన్న పదాలను తొలగించిన భువీ.. ట్విటర్‌లో మాత్రం కొనసాగించడం గమనార్హం. ఏదేమైనా ఈ సీనియర్ పేసర్ తన చర్యతో నెట్టింట వైరల్‌గా మారాడు.
చదవండి: జట్టులో చోటు కొట్టేశావు.. ఆఖరికి జెర్సీ కూడానా?! ఇదేంటి సూర్య!
Yaar Bhuvi!!!!! 😔 We hope atleast me, You will Make a strong comeback🤞. A lot of cricket left in you To play for INDIA. #BhuvneshwarKumar #Bhuvi pic.twitter.com/kB1AXPnQeK
— Devanshu Maheshwari (@beingdevanshu19) July 28, 2023
Comments
Please login to add a commentAdd a comment