
ముంబై: ఇటీవల కాలంలో అత్యంత పరిణితి చెందిన టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఒకడు. భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్వసించే బౌలర్లలో భువీకి ప‍్రత్యేక స్థానం ఉంది. ప్రధానంగా డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా పేరు గాంచిన భువీ.. తన ప్రదర్శనలో క్రమేపీ మెరుగుదల కనిపించడానికి ముఖ్య కారణం అనుభవంతో పాటు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడమేనని స్పష్టం చేశాడు.
‘నేను బౌలర్‌గా మెరుగు కావడానికి ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం ఒకటైతే, రెండోది అనుభవం. నా బౌలింగ్‌లో వైవిధ్య కనిపించడానికి అనుభవం బాగా ఉపయోగపడింది. దాదాపు రెండు మూడేళ్ల నుంచి పలు విషయాల్ని నేర్చుకుంటూ ముందుకు సాగతున్నా. నేను బౌలర్‌గా సక్సెస్ కావడానికి చాలా శ్రమించా. ప్రస్తుతం నేను ఒక కీలక బౌలర్‌గా ఉన్నానంటే అది అంత ఈజీగా వచ్చింది కాదు. తొలుత ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి నిబద్ధత కూడిన ప్రణాళిక సిద్ధం చేసుకున్నా. దాంతో పాటు అనుభవం కూడా కలిసొచ్చింది. ఫిట్‌నెస్, అనుభవం.. ఈ రెండింటి వల్లే నేను బౌలర్‌గా బాగా మెరుగయ్యా’ అని భువీ తెలిపాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున భువనేశ్వర్ కుమార్ ఆడుతున్న సంగతి తెలిసిందే.