IPL 2023: Bhuvneshwar Become 2nd Bowler Dismissing Most Batters For Ducks In IPL, Know Details - Sakshi
Sakshi News home page

IPL 2023: ఐపీఎల్‌లో భువనేశ్వర్‌ అరుదైన రికార్డు.. రెండో బౌలర్‌గా

Published Mon, Apr 24 2023 8:09 PM | Last Updated on Mon, Apr 24 2023 8:27 PM

Bhuvneshwar become 2nd bowler Dismissing most batters for ducks in IPL - Sakshi

Photo Credit : IPL Website

ఐపీఎల్‌లో టీమిండియా వెటరన్‌ పేసర్‌, సర్‌రైజర్స్‌ స్టార్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో బ్యాటర్లను అత్యధిక సార్లు డకౌట్‌ చేసిన రెండో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా ఉప్పల్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఫిల్‌ సాల్ట్‌ను డకౌట్‌ చేసిన భువీ..ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌లో ఇప్పటివరకు భువీ 25 మంది బ్యాటర్లను డకౌట్‌ చేశాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో శ్రీలంక దిగ్గజం లసిత్‌ మలింగా(36) తొలి స్థానంలో ఉన్నాడు.  ఇక ఈ మ్యాచ్‌లో తొలుత ఆరు ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండు వికెట్లు కోల్పో‍యి 49 పరుగులు చేసింది.
చదవండి: అనుష్కతో కలిసి డ్యాన్స్‌ చేసిన కోహ్లి.. అంతలోనే విరాట్‌ కాలికి! ఏం జరిగిందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement