
స్వింగ్ ను ఆపే ముచ్చటే లేదు: భువీ
చండిఘర్: సన్ రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ బంతులను స్వింగ్ చేసే విషయంలో రాజీ పడే ప్రసక్తేలేదని స్పష్టం చేశాడు. గురువారం మీడియాతో భువీ ముచ్చటించాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో బంతులు వేగంగా విసరడంతో స్వింగ్ చేయలేకపోయానని, ఆ తర్వాత వేగంగా విసురుతూ కూడా స్వింగ్ చేయడం తెలుసుకున్నాని భువనేశ్వర్ తెలిపాడు. ఇప్పుడు చాల సంతోషంగా ఉందన్నాడు. యార్కర్ బంతులు విసిరాలంటే నెట్స్ లో తీవ్రంగా శ్రమించాలని, అప్పుడే గుడ్ వేరియేషన్ తో యార్కర్ లు వేయగలమని అభిప్రాయపడ్డాడు. శుక్రవారం కింగ్స్ పంజాబ్ తో జరిగే మ్యాచ్ ఫలితంపై ఆలోచించటం లేదని, గెలుపుకు కావల్సిన ఆటపై మాత్రమే దృష్టి సారించమన్నాడు. టీ20లు ఒత్తిడితో కూడుకుంటాయని, దీన్ని అధిగమించకపోతే నెగ్గలేమని భువీ పేర్కొన్నాడు.
ఐపీఎల్ లో టాప్ లో నిలుస్తానని ఎన్నడు అనుకోలేదని,' నా ఆటనే నన్ను తొలి స్థానంలో నిలబెట్టిందన్నాడు. నేను నా బౌలింగ్ వేరియషన్, స్వింగ్ ను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటానని' భువీ పేర్కొన్నాడు. ఫార్మట్ ను బట్టి బౌలింగ్ వేరియషన్ మారుస్తానని, టెస్టుల్లో అయితే రివర్స్ స్వింగ్ బంతులు వేస్తానని, కానీ నేను రివర్స్ స్వింగ్ బౌలర్ ను కాదని భువీ గుర్తు చేశాడు. యార్కర్ లు వేయడం చాలెంజింగ్ గా భావిస్తానని, టీ20 ఫార్మాట్ లో డెత్ ఓవర్లు వేయడం చాల కష్టమైన పని అని భువీ అభిప్రాయపడ్డాడు. సన్ రైజర్స్ అన్ని విభాగాల్లో రాణిస్తూ ముందుకేళుందన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికయ్యే జట్టులో స్థానం గురించి ఆలోచించడం లేదని, నా ఆటపై మాత్రమే దృష్టి సారిస్తానని, ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపిక ఉంటుందని భువీ పేర్కొన్నాడు. ఈ సీజన్ లో భువనేశ్వర్ కుమార్ 7 మ్యాచుల్లో 16 వికెట్లు తీసి టాప్ లో కొనసాగుతున్నాడు. ఇటీవల పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లు పడగొట్టి భువీ సన్ రైజర్స్ కు ఉత్కంఠకరమైన విజయాన్ని అందించిన విషయం తెలిసిందే.