తానే బెస్ట్‌ బౌలర్‌ అనుకుంటాడు.. కోహ్లి బౌలింగ్‌ అంటే మాకు భయం: భువీ | 'We're Always Scared When He Bowls': Bhuvneshwar Kumar Pokes Fun At Virat Kohli - Sakshi
Sakshi News home page

Virat Kohli: జట్టులో తానే బెస్ట్‌ బౌలర్‌ అనుకుంటాడు.. కోహ్లి బౌలింగ్‌ చేస్తుంటే మాకు భయం: భువీ

Published Tue, Aug 22 2023 3:43 PM | Last Updated on Tue, Aug 22 2023 4:45 PM

We Always Scared When He Bowls: Bhuvneshwar Pokes Fun At Virat Kohli - Sakshi

విరాట్‌ కోహ్లి- భువనేశ్వర్‌ కుమార్‌

Bhuvneshwar Kumar Comments On Virat Kohli: టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లిని ఉద్దేశించి భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఉన్న అందరి బౌలర్ల కంటే తానే బెస్ట్‌ అని కోహ్లి భావిస్తాడని.. అయితే, అతడు బంతి పట్టుకుంటే తాము మాత్రం హడలిపోయేవాళ్లమని పేర్కొన్నాడు. అందుకు గల కారణాన్ని కూడా భువీ వెల్లడించాడు. 

షాకిచ్చిన బీసీసీఐ
కాగా 2012లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన భువనేశ్వర్‌ కుమార్‌.. ఇప్పటి వరకు 21 టెస్టులు, 121 వన్డేలు, 87 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 63, 141, 90 వికెట్లు పడగొట్టాడు. అయితే, భువీ గత కొంతకాలంగా వరుసగా విఫలం కావడంతో బీసీసీఐ అతడిని సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తప్పించింది.

అదే ఆఖరు
గతేడాది నవంబరులో న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు ఈ రైట్‌ ఆర్మ్‌ పేసర్‌. అప్పటి నుంచి మళ్లీ అతడు జట్టుకు ఎంపిక కాలేదు. ఇదిలా ఉంటే.. ముంబైలో సోమవారం జరిగిన CEAT అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో భువనేశ్వర్‌ కుమార్‌ పాల్గొన్నాడు.

కోహ్లి బౌలింగ్‌ చేస్తుంటే మాకు భయమేస్తుంది
ఈ సందర్భంగా కోహ్లి గురించి ప్రస్తావన రాగా.. ‘‘విరాట్‌ కోహ్లి... జట్టులో ఉన్న అత్యుత్తమ బౌలర్‌ తానేనని భావిస్తాడు. కానీ మేము మాత్రం కోహ్లి బౌలింగ్‌ చేసినప్పుడల్లా భయపడిపోతాం. తన బౌలింగ్‌ యాక్షన్‌ కారణంగా ఎక్కడ గాయపడతాడో అని బెంబేలెత్తిపోతాం’’ అని భువీ సరదాగా వ్యాఖ్యానించాడు.

కింగ్‌ ఎక్కడైనా కింగే!
ఇక క్రికెటర్‌ కాకపోయి ఉంటే కోహ్లి మల్లయోధుడు(రెజ్లర్‌) అయి ఉండేవాడని భువీ పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనంలో వెల్లడించింది. ఈ క్రమంలో కోహ్లి గురించి భువీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో కింగ్‌ ఫ్యాన్స్‌ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘భారత జట్టులో ఉన్న చాలా మంది బౌలర్ల కంటే కోహ్లి బెస్ట్‌’’అని ఫొటోలు షేర్‌ చేస్తున్నారు.

ఆసియ కప్‌ బరిలో
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సెలవుల్లో ఉన్న కోహ్లి ఆగష్టు 30 నుంచి మొదలుకానున్న ఆసియా కప్‌-2023తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఇక ఈ వన్డే టోర్నీకి సంబంధించిన జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో నలుగురు పేసర్లను సెలక్టర్లు ఎంపిక చేయగా.. భువీకి మాత్రం చోటు దక్కలేదు.

చదవండి: వరల్డ్‌కప్‌ జట్టులో రోహిత్‌ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు! వెంటనే కోచ్‌..
అందుకే తిలక్‌ను సెలక్ట్‌ చేశాం.. వరల్డ్‌ కప్‌ టీమ్‌లో: బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌
WC 2023: ధావన్‌ కెరీర్‌కు ఎండ్‌కార్డ్‌? అంతేనన్న అగార్కర్‌! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement