అంతా బాగానే ఉంది కానీ.. అప్పట్లో కోహ్లి, ద్రవిడ్‌: రోహిత్‌కు వార్నింగ్‌ | 'Kohli Faced It. Dravid Faced It In 2007': Gambhir's Warning For Rohit Ahead Of WC 2023 | Sakshi
Sakshi News home page

అంతా బానే ఉంది కానీ.. రోహిత్‌కు అసలు పరీక్ష అదే! అప్పట్లో కోహ్లి, ద్రవిడ్‌..: మాజీ క్రికెటర్‌ వార్నింగ్‌

Published Mon, Sep 18 2023 1:46 PM | Last Updated on Tue, Oct 3 2023 7:16 PM

Kohli Faced Dravid Faced It In 2007: Gambhir Warning For Rohit Ahead WC 2023 - Sakshi

Asia Cup 2023 Winning Captain- Rohit Sharma: ‘‘రోహిత్‌ శర్మ కెప్టెన్సీపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. ఐపీఎల్‌లో కొంతమందైతే ఒక్కసారి జట్టును గెలిపించలేకపోయారు. కానీ.. రోహిత్‌ ఏకంగా ఐదు టైటిళ్లు గెలిచాడు. అయితే, అసలు పరీక్ష ముందుంది. రాబోయే 15 రోజులలో ఏం జరుగుతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జట్టులో ప్రస్తుతం 15- 18 అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్లు ఉన్నారు. అయితే, వారిలో ఒక్కరైనా సరే సరైన సమయంలో రాణించకపోతే అప్పుడు అన్ని వేళ్లు రోహిత్‌ వైపే చూపిస్తాయి. వరల్డ్‌కప్‌ ముగిసిన తర్వాత ప్రతి కెప్టెన్‌ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది.

గతంలో కోహ్లి, ద్రవిడ్‌ ఫేస్‌ చేశారు
విరాట్‌ కోహ్లి గతంలో ఇదంతా ఫేస్‌ చేశాడు. 2007లో రాహుల్‌ ద్రవిడ్‌కు సైతం ఇలాంటి పరిస్థితే ఎదురైంది’’ అని టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ భారత సారథి రోహిత్‌ శర్మను హెచ్చరించాడు.

ఆసియా విజయంతో నూతనోత్సాహం
కాగా సొంతగడ్డపై పుష్కరకాలం తర్వాత టీమిండియా వన్డే ప్రపంచకప్‌ ఆడనున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, నెదర్లాండ్స్‌ ఈ ఐసీసీ టోర్నీలో పాల్గొననున్నాయి.

అయితే, అంతకంటే ముందే భారత జట్టు ఆసియా కప్‌-2023లో భాగంగా పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంకతో మ్యాచ్‌లు ఆడింది. ఈసారి వన్డే ఫార్మాట్లో నిర్వహించిన టోర్నీ ఫైనల్లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసి చాంపియన్‌గా అవతరించింది.

లోపాలు బయటపడ్డాయి
ప్రపంచకప్‌నకు ముందు ఈ గెలుపు టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే.. చెత్త ఫీల్డింగ్‌తో పరుగులు ఇవ్వడం, క్యాచ్‌లు డ్రాప్‌ చేయడం.. చెత్త షాట్ల ఎంపిక వంటి కొన్ని పొరపాట్లు సరిచేసుకోవాల్సి ఉంది.

ఆసీస్‌తో సన్నాహక సిరీస్‌
ఇదిలా ఉంటే.. ఆసియా విజయంతో పాటు మెగా టోర్నీ కంటే ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ఆడటం కూడా భారత్‌కు మంచి సన్నాహకంగా ఉపయోగపడనుంది. ఈ నేపథ్యంలో.. గౌతం గంభీర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. అంతా బాగానే ఉంది కానీ.. రోహిత్‌ కెప్టెన్సీకి అసలు పరీక్ష వరల్డ్‌కప్‌ రూపంలో ముందు ఉందని అభిప్రాయపడ్డాడు.

జాగ్రత్త రోహిత్‌.. గంభీర్‌ వార్నింగ్‌
ఆసియా కప్‌ రెండుసార్లు గెలిచిన రోహిత్‌ను ప్రశంసిస్తూనే.. వరల్డ్‌కప్‌- 2023లో గనుక ఏమాత్రం తేడా జరిగినా విమర్శల పాలుకాక తప్పదని వార్నింగ్‌ ఇచ్చాడు. గతంలో కోహ్లి, ద్రవిడ్‌ విషయంలో ఇలాగే జరిగిందని గుర్తు చేశాడు. 

అయితే, ఈసారి జట్టు పటిష్టంగా ఉన్న కారణంగా రోహిత్‌ పని సులువు కానుందని.. కచ్చితంగా ఫైనల్‌ చేరతారని గంభీర్‌ అంచనా వేశాడు. ఒకవేళ టీమిండియా రాణించకపోతే రోహిత్‌ కెప్టెన్సీపై ప్రశ్నలు, చర్చలు మొదలవుతాయని పేర్కొన్నాడు.

చదవండి: అతడే మా కొంపముంచాడు.. మమ్మల్ని క్షమించండి ప్లీజ్‌: శ్రీలంక కెప్టెన్‌ 
సిరాజ్‌ కాదు!; వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రధాన అస్త్రం అతడే: పాక్‌ లెజెండ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement