జాతీయ జట్టులో చోటు కోల్పోయిన టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. దేశీవాళీ క్రికెట్‌లో అద్బుతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తర ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భువీ నిప్పలు చేరుగుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ 5వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 3.3 ఓవర్లు వేసిన భువనేశ్వర్ కేవలం 16 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
తొలి రెండు ఓవర్లలో వికెట్లు సాధించికపోయిన భువీ.. డెత్ ఓవర్లలో 9 బంతుల్లో 5 వికెట్లు తీశాడు. 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక.. భువీ దాటికి 156 పరుగులకు ఆలౌటైంది. భువీతో పాటు యశ్ దయాల్ రెండు వికెట్లు సాధించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. యూపీ బ్యాటర్లలో గోస్వామి(77), నితీష్ రానా(40) పరుగులతో రాణించారు.
చదవండి: World Cup 2023: ఓటమి బాధతో బాబర్ ఏడ్చాడు.. తప్పు అతనొక్కడిదే కాదు: పాకిస్తాన్ లెజెండ్
Comments
Please login to add a commentAdd a comment