T20 WC Ind Vs Pak: Bhuvneshwar Kumar Became India All Time Highest Wicket Taker In T20Is - Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: భువనేశ్వర్‌ కుమార్‌ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా

Published Tue, Oct 25 2022 11:06 AM | Last Updated on Tue, Oct 25 2022 5:48 PM

T20 WC: Bhuvneshwar Kumar achieve massive feat in IND vs PAK clash - Sakshi

అంతర్జాతీ టీ20ల్లో టీమిండియా వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా భువీ రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌-2022లో భాగంగా ఆదివారం(ఆక్టోబర్‌ 23) చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహిన్‌ ఆఫ్రిదిని ఔట్‌ చేసిన భువీ.. తన 86వ టీ20 వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

తద్వారా ఈ అరుదైన ఘనతను భువీ తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటి వరకు టీ20 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్‌ 86 వికెట్లు సాధించాడు. అంతకుముందు ఈ  రికార్డు టీమిండియా  స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌(85) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో చాహల్‌ రికార్డును భువీ బ్రేక్‌ చేశాడు.

ఇక అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్‌పై 4 వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించింది. ఈ విజయంలో భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 82 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లి.. అఖరి వరకు క్రీజులో నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.


చదవండి: T20 World Cup 2022: తొలి రౌండ్‌లోనే ఇంటికి.. వెస్టిండీస్‌ కెప్టెన్సీకి పూరన్‌ గుడ్‌బై!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement