వేసవి వచ్చిందంటే మన అందరికీ గుర్తు వచ్చే డ్రింక్ చెరుకు రసం. పిల్లా పెద్దా అంతా ఎంతో ఇష్టంగా తాగుతారు. మండు వేసవిలో దాహాన్ని తీర్చడమే కాదు, చెరుకు రసంలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి.
మండు టెండలో, దాహంతో అల్లాడిపోతున్నపుడు చెరుకు రసం బండి కనిపిస్తే ప్రాణం లేచి వస్తుంది. చల్ల చల్లగా గ్లాసు రసం తాగితే తాగితే హాయిగా ఉంటుంది. అయితే చెరుకు రసం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఇక అస్సలు వదలరు. శుభ్రమైన చెరుకు రసం ఇన్ఫెక్షన్లను నివారించడంలోనూ, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ బాగా పనిచేస్తుంది.
చెరకు రసంలో యాంటీఆక్సిడెంట్లు ,ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి యాంటి ఏజింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి.
సౌందర్య పోషణలోనూ, జుట్టు సంరక్షణలోనూ దీని ప్రయోజనాలు అద్భుతం అని చెప్ప వచ్చు. చెరుకులో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ B12, ఐరన్‌తో సహా అవసరమైన పోషకాలతో నిండి ఉంది. సహజ కండీషనర్‌గా పని చేసి జుట్టును మృదువుగా, సిల్కీగా తయారు చేస్తుంది. హెయిర్ ఫోలికల్స్ ను బలపరిచే మినరల్స్ చెరకు రసంలో పుష్కలంగా ఉన్నాయి
చెరకు రసంలో తేనె కలిపి పావుగంట పాటు చర్మానికి మర్దన చేయాలి. తర్వాత ఇరవై నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. స్కిన్ గ్లోయింగ్, యంగ్‌గా కనిపించాలంటే ఇంకో చిట్కా ఏంటంటే చెరకు రసంతో తయారు చేసిన ఐస్ క్యూబ్‌లతో ముఖం, మెడ, చేతులపై మసాజ్ చేసుకోవాలి. అలాగే చెరకురసానికి కాస్తంత కాఫీపొడి చేర్చి స్క్రబ్‌లా ఉపయోగిస్తే మొటిమలు, మచ్చలు తొలగి పోయి కొత్త మెరుపు వస్తుంది.
బొప్పాయి గుజ్జులో చెరకు రసాన్ని కలిపి పట్టించి, ఆరిన తరువాత చల్లని నీళ్లతో కడిగేసు కోవాలి స్కిన్ టైట్ అయిన ఫీలింగ్ తెలుస్తుంది. చెరకు రసం నెయ్యి కలిపి, చర్మానికి మర్దనా చేస్తే ఎండ వల్ల కమిలిన చర్మం తిరిగి కొత్త నిగారింపును సంతరించుకుంటుంది.
శుభ్రమైన చెరుకు రసాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు చర్మానికి పట్టిస్తే చర్మం ఆరోగ్యంగా, మృదువుగా మారుతుంది. చెరుకు రసంలో కొద్దిగా అల్లం, నిమ్మరసం కలుపుకొని తాగితే అలసట, నీరసం మాయమై కొత్త శక్తి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment