సీవీడ్ అనేది ఒకరకమైన సముద్రపు నాచు. దీని సుషీ లేదా నోరి అని పిలుస్తారు. దీని వల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కూరగాయాలు, గుడ్లు, చేపలు వంటి వాటితో కలిపి దీన్ని రకరకాల రెసీపీలు చేస్తారు. ఇది జపాన్‌కి చెందింది. ప్రస్తుతం భారత్‌లో కూడా అత్యంత ప్రజాధరణ పొందిన వంటకంగా మారింది. దీన్ని ప్రాసీస్ చేసిన తర్వాత ఆకుపచ్చ షీట్‌లా కనిపిస్తుంది. ఇది ప్రత్యేకమైన రుచికి ప్రసిద్ధి. అలాంటి సుపీని ఆహారంలో చేర్చుకోవడంలో కలిగే ప్రయోజనాలేంటో సవివరంగా చూద్దాం.
పోషకాల గని..
సీవీడ్‌లో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది థైరాయిడ్ పనితీరుకు అవసరమైన అయోడిన్‌కి మంచి మూలం. అలాగే, ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లతో పాటు విటమిన్లు ఎ, సి, ఇ, కె ఉన్నాయి.
బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉనికి..
సీవీడ్‌లో అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి భూమిలోని కూరగాయలలో కనిపించవు. ఈ సమ్మేళనాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, యాంటీ ట్యూమర్ లక్షణాలను కలిగి ఉంటాయి. అంతేగాదు ఇది క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనంలో తేలింది.
జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంచడంలో..
నోరి లేదా సీవీడ్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మన గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ప్రేగు కదలికలను సక్రమంగా ఉంచి మలబద్ధకాన్ని నివారిస్తుంది. తద్వారా జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అలాగే కొన్ని రకాల సీవీడ్‌లలో ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఇవి గట్ మైక్రోబయోమ్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. తద్వారా గట్ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.
గుండె ఆరోగ్యం
సీవీడ్‌లో పొటాషియం, మెగ్నీషియం హృదయ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాన్ని ఎదుర్కొనడమే గాక రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే, ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అయోడిన్ మూలం
థైరాయిడ్ పనితీరుకు అవసరమైన అయోడిన్ సమృద్దిగా లభించే వాటిలో సీవీడ్ ఒకటి. ఇది థైరాయిడ్ జీవక్రియ, పెరుగుదల, అభివృద్ధికి ముఖ్యమైన హార్మోన్ల పనితీరును నియంత్రిస్తుంది.
బరువు నిర్వహణలో..
సీవీడ్‌లో ఫైబర్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. దీన్ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల బరువు నిర్వహణలో సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే..?ఇది సంతృప్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మొత్తం క్యాలరీలను తీసుకోవడం తగ్గించి ఎక్కువసేపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.
ఆరోగ్యకరమైన చర్మం
సీవీడ్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నుంచి రక్షించడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుంది.అలాగే దీనిలో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ వంటివి కొల్లాజెన్ ఉత్పత్తి తోడ్పతాయి. ఇది చర్మ మరమ్మత్తులో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు
సీవీడ్ యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉందని అధ్యయనాల్లో వెల్లడయ్యింది. ఇవి వైరస్‌లు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. తద్వారా రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది.
(చదవండి: వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..)
Comments
Please login to add a commentAdd a comment