బచ్చలి కూరతో చేసే వంటల రుచే వేరు. అందులోనూ ఎర్ర బచ్చలి కూర మరింత రుచిగా ఉంటుంది. దీన్ని అమరాంత్ సాగ్ అని కూడా పిలుస్తారు. ఈ అద్భతమైన ఆకుకూరతో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకుకూరని రోజూవారి ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యంలో వచ్చే మంచి మార్పును గమనించగలుగుతారు. దీని వల్లే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఆరోగ్య నిపుణుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!
దీనిలో ఈ, సీ, కే, ఇనుము, కాల్షియం, వంటి ముఖ్యమైన ఖనిజాలతో నిండిన పోషకాహార శక్తి కేంద్రం. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఎర్ర బచ్చలి కూర అద్భుతమైన ఆప్షన్. దీనిలో అదికంగా ఉండే పోషకాలు మంచి రుచిని అందించడమే కాకుండా మంచి ఫిట్‌నెస్‌కు ఉపయుక్తంగా ఉంటుంది.
బరువుని ఎలా తగ్గిస్తుందంటే..
ఎరుపు బచ్చలి కూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని తీసుకుంటే కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. అందువల్ల జంక్‌ఫుడ్‌లాంటి ఇతర ఆహారాల జోలికిపోరు. అదీగాక బరువు తగ్గాలనుకునే వారికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తప్పనిసరి
ఇతర ఆరోగ్య ప్రయోజనాలు..
మలబద్దకంతో పోరాడుతుంది
జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇందులో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచుతుంది.
అద్భుతమైన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
దీనిలో ఉండే ప్రోటీన్, విటమిన్ కే కంటెంట్‌లు కాలనుగుణ వ్యాధులతో పోరాడటంలో సహాయపడుతుంది.
ఇందులో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉండటంతో ఎముకలను దృఢంగా ఉంచటంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ బచ్చలి కూరను పప్పుతో లేదా బంగాళ దుంపతో చేరి కాస్త సుగంధద్రవ్యాలను కూడా జోడించి తీసుకునేందుకు ప్రయత్నించండి.
Comments
Please login to add a commentAdd a comment