ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్‌కు గడువు దగ్గర పడుతోంది. మీ ఆదాయం, పన్ను పరిధిలోకి వచ్చినా రాకపోయినా, రిటర్న్స్ దాఖలు దాఖలు చేయడం చాలా అవసరం. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఐటీఆర్ ఫైలింగ్‌వల్ల వచ్చే లాభాలు, ఇతర అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.
ఆదాయం,పెట్టుబడులను వెల్లడించేందుకు ఆదాయ పన్ను శాఖకు ఐటీఆర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ప్రధానంగా 5 అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. గడువుకు ముందే మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయడం ఖచ్చితంగా అవసరం. కొత్త బడ్జెట్‌లో ప్రకటించిన దాని ప్రకారం మీరు ఏ విధానం కిందికి వస్తారో గుర్తించి సరైన పన్ను విధానాన్ని ఎంచుకోవాఇ. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను దాఖలు చేసిన 30 రోజులలోపు వెరిఫై చేయడం ముఖ్యం. రిటర్న్ ధృవీకరించబడకపోతే, అది చెల్లనిదిగా పరిగణించ బడుతుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS), లైఫ్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు , హోమ్ లోన్ వడ్డీలు ప్రామాణిక తగ్గింపులకు అర్హులు. ఎక్కువ రిటర్న్స్ రావాలంటే ఇలాంటి వాటిని క్లెయిమ్ చేయాలి.
మీ బ్యాంక్ ఖాతాను ధృవీకరించాలి. ఆదాయపు పన్ను ఫైలింగ్ పోర్టల్‌లో ఎలాంటి పొరపాటు దొర్లకుండా మన బ్యాంకు ఖాతా నంబరును జోడించాలి. తద్వారా రీఫండ్ క్రెడిట్‌లో సమస్యల్ని నివారించవచ్చు.
ఐటీఆర్ ఫైలింగ్, లాభాలు
సకాలంలో ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైలింగ్ ద్వారా, పెనాల్టీలను నివారించవచ్చు . టాక్స్ రిఫండ్ కోసమే కాకుండా, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఒకవేళ చెల్లించిన పన్ను మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని మించి ఉంటే, దాన్ని రీఫండ్ రూపంలో క్లెయిం చేసుకోవచ్చు.
వీసా జారీలో సమస్యల్లేకుండా ఉండాలంటే: ఉద్యోగరీత్యానో మరో కారణంగానో విదేశాలకు ఎగిరి పోవాలనుకుంటే వీసా ఖచ్చితంగా కావాలి. మరి అలాంటి వీసాకు దరఖాస్తు సమయంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి ఉంటే వీసా పని ఈజీ అవుతుంది.
ఆదాయ నిర్ధారణగా: ప్రభుత్వ, ప్రైవేటు వ్యవహారాలు, బిజినెస్ అవసరాల్లో ఆదాయ పన్ను శాఖ ఇచ్చే సర్టిఫికెట్ ఇన్‌కమ్ ప్రూఫ్ సర్టిఫికెట్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది.
ఈజీగా బ్యాంకు లోను కావాలంటే: అంతేకాదు ఐటి రిటర్న్స్ దాఖలు పూర్తి చేసి ఉంటే వ్యక్తిగత లోన్లతో పాటు, భారీ మొత్తంలో బ్యాంకు రుణం పొందడం కూడా సులువు.
బీమా కవర్: అలాగే ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసినపుడు ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ వివరాలను చాలా వరకు బీమా సంస్థలు డిమాండ్ చేస్తాయి
Comments
Please login to add a commentAdd a comment