కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన ఒకటి. ఈ స్కీమ్ పాలసీ తీసుకున్న పాలసీ దారుడు ప్రమాదవశాత్తూ మరణిస్తే.. వారి కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకునేందుకు సాయపడుతుంది.
రూ.2 లక్షల వరకు ప్రయోజనం
ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకంలో ఏడాదికి రూ.20 చెల్లించి రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందవచ‍్చు.
మే నెల చివరిలో బ్యాలెన్స్ కట్
పీఎం సురక్ష బీమా యోజన పథకంలో చేరాలనుకునే వారు సంబంధిత బ్యాంకులు, పోస్టాఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ బీమా పాలసీ తీసుకున్న పాలసీ దారులు ఆటో డెబిట్ పెట్టుకుంటే వారి అకౌంట్ నుంచి ప్రతి సంవత్సరం రూ.20 బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా కట్ అవుతాయి.
కావాల్సిన డాక్యుమెంట్లు
ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన పథకంలో చేరాలనుకునే వారికి బ్యాంక్ అకౌంట్,ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది.
అర్హులు ఎవరంటే
కేంద్రం అందిస్తున్న ఈ పథకంలో 18 నుంచి 70 ఏళ్ల వయసు వారు చేరేందుకు అర్హులు.
Comments
Please login to add a commentAdd a comment