కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ బ్యూటిషియన్‌పై అత్యంత దారుణంగా హత్యాయత్నం జరిగింది. కాళ్లు, చేతులు కట్టేసి ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డారు దుండగులు. బాధితురాలిని పిల్లి పద్మగా పోలీసులు గుర్తించారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ పద్మ, రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఉంటే స్థానికులకు గమనించి ఆమెను ఏలూరు ఆసుపత్రికి తరలించారు.