ఏఐ సాంకేతికత ప్రపంచాన్నే మారుస్తోంది. ప్రస్తుతం ఏఐ విద్యా, వైద్య, మార్కెటింగ్,సేల్స్, ఫైనాన్స్ , కంటెంట్ క్రియేషన్ వంటి పలు రంగాలను ప్రభావితం చేసింది. దీంతో ఇక భవిష్యత్తులో ఉద్యోగాలు ఉంటాయా? అనే భయాన్ని రేకెత్తించేలా శరవేగంగా దూసుకుపోతుంది. ఇక మిగిలింది సౌందర్యానికి సంబంధించిన బ్యూటిషయన్ రంగం ఒక్కటే మిగిలి ఉంది. ఇందులో కూడా ఆ సాంకేతికత హవా కొనసాగుతుందా అంటే..సందేహాస్పదంగా సమాధానాలు వస్తున్నాయి నిపుణుల నుంచి. ఎందుకంటే చాలా వరకు మానవ స్పర్శకు సంబంధించిన రంగం. ఇంతకీ ఈ సాంకేతికత ప్రభావితం చేయగలదా? అలాగే ఈ రంగంలో ఏఐ హవాను తట్టకునేలా ఏం చెయ్యొచ్చు..
బ్యూటీషియన్ రంగంలో ఐఏ సాంకేతిక వస్తే.. సరికొత్త ఇన్నోవేషన్‌తో.. వర్చువల్ టూల్స్‌ని మెరుగుపర్చగలదు. అంటే ఎలాంటి మేకప్‌లు సరిపడతాయి, చర్మ నాణ్యత తదితర విషయాల్లో సలహాలు, సూచనలు ఇవ్వగలదు. మానవునిలా ప్రభావవితం చేయలేదు. ఎందుకంటే ఇది సృజనాత్మకత, భావోద్వేగం, టచ్‌తో కూడిన కళ. 2020లో మహమ్మారి సమయంలో ఈసాంకేతికత ప్రభంజనంలా దూసుకుపోయిందే తప్ప మరేంకాదని కొట్టేపడేస్తున్నారు నిపుణులు.
అయితే బ్యూటీషియన్ రంగంలోని మేకప్ పరిశ్రమను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇక్కడ కస్టమర్ మనోగతం ఆధారంగా అందమైన రూపు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఏఐ సరైన మేకప్‌ని కస్టమర్లకు ఇవ్వడం అన్నది సాధ్యం కానీ విషయం. ఓ మోస్తారుగా ఇలాంటి మేకప్ ఇస్తే ఇలా ఉంటుందని వర్చువల్ ఐడియానే అందివ్వగలదే తప్ప కస్లమర్‌కి నచ్చినట్టుగా క్రియేటివిటీతో కూడిన మేకప్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు.
అలాగే క్లయింట్‌లకు ఎలాంటి బ్యూటీప్రొడక్ట్‌లు వాడితే బెటర్ అనేది, చర్శ తత్వం తదితరాలకు మాత్రమే ఐఏ ఉపయోగపడవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఐఏ అందానికి సంబంధివచి ప్రభావితం చేయాలేని కీలక అంశాలు గురించి కూడా చెప్పారు. అవేంటంటే..
కళాత్మక క్రియేటివిటీ : బ్యూటీషియన్ నిపుణులే మూఖాకృతి తీరుకి సరైన మేకప్‌తో ఒక మంచి రూపాన్ని ఇవ్వగలరు. ఇది నిశితమైన అంతర్‌దృష్టికి సంబంధించిన క్రియేటివిటీ.
ఎమోషనల్ కనెక్షన్: కస్టమర్ల సౌందర్య సంప్రదింపుల్లో ఇది అత్యంత కీలకమైంది. క్లయింట్ వ్యక్తిగతంగా ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారనేది అర్థం చేసుకుని సలహాలు, సూచనలివ్వాల్సి ఉంటుంది.
స్పర్శ సేవ: షేషియల్, మసాజ్ వంటి సౌందర్య చికిత్సలలో టచ్ అనేది కీలకం. బ్యూటీషియన్ అనుభవం ఆధారంగా కస్టమర్లకు దొరికే మంచి అనుభూతిగా చెప్పొచ్చు.
ఒక వేళ ఏఐ సౌందర్య రంగాన్ని ప్రభావితం చేసినా..బ్యూటీషియన్లు ఈ సవాలుని స్వీకరించేందుకు సిద్ధపడాలి. అలాగే కస్టమర్లకు మెరగైన సేవను అందించి సాంకేతికత కంటే..మనుషుల చేసేదే బెటర్ అనే నమ్మకాన్ని సంపాదించుకునే యత్నం చేయాలి. బ్యూటీషియన్లంతా ఈ రంగంలో అచంచలంగా దూసుకునిపోయేలా ఏఐని స్నేహితుడిగా మలుచుకుంటే మరిన్న ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. అలాంటి వారే ఎలాంటి సాంకేతిక ఆటను ఈజీగా కట్టడి చేయగలరు అని నమ్మకంగా చెబుతున్నారు విశ్లేషకులు.
(చదవండి: 40 ఏళ్ల నాటి గౌనులో యువరాణి అన్నే..!)
Comments
Please login to add a commentAdd a comment