దిశా పటానీకి వార్నింగ్‌.. ఇంటి ముందు కాల్పులు | Golti Gang Gun Fire On Disha Patani Bareilly House Front Gate, More Details Inside | Sakshi
Sakshi News home page

దిశా పటానీకి వార్నింగ్‌.. ఇంటి ముందు కాల్పులు

Sep 13 2025 7:14 AM | Updated on Sep 13 2025 11:37 AM

Golti Gang Gun Fire On Disha Patani House Front Gate

బాలీవుడ్‌ హీరోయిన్‌ దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌ బరేలీలోని తన నివాసం వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ కాల్పుల వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు కేసు నమోదు  చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు  చేస్తున్నట్లు తెలిపారు.దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసినట్లు తెలుస్తోంది. ఈ కారణం వల్లే ఈ దాడి జరిగిందని స్థానికులు భావిస్తున్నారు .

అయితే, ఈ కాల్పులు తామే జరిపామని గోల్టీ బ్రార్‌ గ్యాంగ్‌ ప్రకటించింది. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఈ విషయాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. మాజీ ఆర్మీ అధికారిణి అయిన ఖుష్బూ ప్రస్తుతం ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు.

హీరోయిన్ దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement