better results
-
మెరుగైన ఫలితాలు సాధిస్తాం: అఖిలేశ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బుధవారం విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార బీజేపీలో అంతర్గత పోరు ఉందని, అధికారం కోసం వారి కుమ్ములాటలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఇంతకుముందు ఇతర పార్టీల్లో చీలిక రాజకీయాలు చేసిన బీజేపీ ఇప్పుడు సొంత పార్టీలోనూ చీలికలకు పాల్పడుతోందన్నారు. -
అత్యున్నత ఫలితాలే లక్ష్యం కావాలి
సాక్షి, హైదరాబాద్: పరీక్షల నిర్వహణలో గుణాత్మక మార్పు తేవాలని విద్యాశాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. టెన్త్, ఇంటర్మిడియెట్ పరీక్షలు స్వేచ్ఛాయుతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని కోరారు. అత్యున్నత స్థాయి ఫలితాలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ తొలిసారిగా మంగళవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మిడియెట్ బోర్డు కార్యదర్శి హోదాలో నవీన్ మిత్తల్, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన హాజరయ్యారు. ఇంటర్, టెన్త్ పరీక్షలకు సంబంధించిన సమగ్ర వివరాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు, రాబోయే ఫలితాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన ఫలితాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కోరారు. గత ఏడాది పేపర్ లీకేజీ ఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు తెలిసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయాలని కోరారు. కాగా ఆన్లైన్ మూల్యాంకన విధానాన్ని ఇంటర్ అధికారులు సీఎంకు వివరించారు. దీనివల్ల అతి తక్కువ సమయంలో ఫలితాల వెల్లడికి ఆస్కారం ఉందని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ దిశగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన సిఫారసులు, వాటి సాధ్యాసాధ్యాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిసింది. ప్రైవేటుతో సమానంగా ఫలితాలు రావాలి ప్రైవేటు విద్యా సంస్థలతో సమానంగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మెరుగైన ఫలితాలు రావాల్సిన అవసరాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నొక్కి చెప్పారు. దీంతో గురుకులాల్లో మెరుగైన ఫలితాలు వస్తున్న తీరును అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చా రు. ఈ క్రమంలోనే గురుకులాల్లో మాదిరిగా ప్రభు త్వ స్కూళ్లల్లోనూ ఫలితాలు పెంచాల్సిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన బోధన, పరీక్షలకు సన్నద్ధమయ్యే మెళకువలు మెరుగు పర్చేందుకు సరికొత్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. ఇంటర్ తర్వాత జరిగే పోటీ పరీక్షలకు రాష్ట్ర విద్యార్థులను, ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులను సన్నద్ధం చేయాలని, ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని సూచించారు. మండలానికో కాలేజీ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ విద్యార్థులకు కాలేజీలు అందుబాటులో ఉండాలని సీఎం చెప్పారు. ప్రతి మండలానికి ఓ కాలేజీ ఏర్పాటు అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో అవసరాన్ని బట్టి అధ్యాపకులను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో సీట్లు మిగిలిపోతుండటంపై ఆయన ఆరా తీశారు. పదోన్నతులు చేపడితే ఖాళీలపై స్పష్టత రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు, పరీక్షలు, ఫలితాల గురించి దేవసేన సీఎంకు వివరించారు. వివిధ సబ్జెక్టు టీచర్ల కొరత, ఖాళీల భర్తీ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో జరిగిన కసరత్తు చర్చకు వచ్చినట్టు తెలిసింది. 5 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి ఎన్నికల ముందు చేపట్టిన ప్రక్రియ ఆగి పోయిందని అధికారులు తెలిపారు. పాఠశాల విద్యాశాఖలో 18 వేలకు పైగా ఖాళీలున్నాయని, పదోన్నతులు చేపడితే ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై స్పష్టమైన సమాచారం వస్తుందని వివరించారు. టెట్ ఉత్తీర్ణులకే పదోన్నతులు ఇవ్వాలన్న కోర్టు తీర్పు అడ్డంకిగా ఉందని చెప్పగా, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పినట్లు సమాచారం. -
చైనా టీకా ఫలితాలూ భేష్!
బీజింగ్: కరోనా వైరస్ నిరోధానికి చైనా అభివృద్ధి చేస్తున్న టీకా రెండో దశ మానవ ప్రయోగాల్లోనూ సురక్షితమైందే కాకుండా.. వైరస్‌కు వ్యతిరేకంగా రోగ నిరోధక వ్యవస్థ స్పందించేలా చేస్తోందని అంతర్జాతీయ వైద్య పరిశోధనల జర్నల్ ‘ద లాన్సెట్’లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం తెలిపింది. ఆక్స్ఫర్డ్ వర్సిటీ సిద్ధం చేస్తున్న టీకా ఫేజ్1, 2 ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజే ఈ ఫలితాలురావడం గమనార్హం. టీకా భద్రతను, రోగనిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని అంచనా వేసేందుకు నిర్వహించిన ఫేజ్ 2 ప్రయోగాలు సత్ఫలితాలిచ్చాయని, ఫేజ్ –1లో 55 ఏళ్ల పైబడ్డ వారు కొంతమందికి టీకా అందించగా.. తరువాతి దశలో ఎక్కువమందికి టీకాను ఇచ్చామని టీకా ప్రయోగాల్లో పాల్గొన్న చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శాస్త్రవేత్తలు వివరించారు. టీకా వేసిన తరువాత రెండో దశ ప్రయోగాల్లో పాల్గొన్న వారెవరికీ వైరస్ సోకలేదని చెప్పారు. వైరస్ కొమ్ములను తయారు చేసేలా వైరస్ జన్యుపదార్థంలో మార్పులు చేశామని వివరించారు. టీకాలోని వైరస్ కణాల్లోకి ప్రవేశించి కొమ్ములను ఉత్పత్తి చేసిన తరువాత వినాళ గ్రంథులకు వెళ్లినప్పుడు వైరస్ వ్యతిరేక యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని తెలిపారు. (ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లు సగం మనకే ) 508 మందిపై ప్రయోగాలు చైనా అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాను రెండో దశ మానవ ప్రయోగాల్లో భాగంగా 508 మందిపై ప్రయోగించారు. వీరిలో 253 మందికి అత్యధిక మోతాదులో టీకాను అందించగా 129 మందికి అత్యల్పంగా ఇచ్చారు. 126 మంది ఉత్తుత్తి టీకా ఇచ్చారు. ప్రయోగాల్లో పాల్గొన్న వారిలో మూడింట రెండు వంతుల మంది 18–44 మధ్య వయస్కులు కాగా 13 శాతం మంది 55 ఏళ్లపైబడ్డ వారు. టీకా ఇచ్చిన అరగంట నుంచే వారందరినీ పరీక్షించడం మొదలుపెట్టామని, 14, 28 రోజుల తరువాత పరిశీలనలు జరిపామని పరిశోధన వ్యాసంలో వివరించారు. కొంతమందిలో జ్వరం, నిస్సత్తువ వంటి దుష్ప్రభావాలు కనిపించాయని తెలిపారు. మొత్తమ్మీద చూసినప్పుడు అధిక మోతాదులో టీకా తీసుకున్న వారిలో 95 శాతం మందిలో, తక్కువ మోతాదు టీకా తీసుకున్న వారిలో 91 శాతం మందిలోనూ రోగ నిరోధక వ్యవస్థ స్పందించినట్లు స్పష్టమైంది. టీకా తీసుకున్న 28 రోజుల తరువాత జరిపిన పరిశోధనల్లో వీరిలో యాంటీబాడీలు లేదా టి–కణాలు ఉత్పత్తి అయినట్లు గుర్తించారు. (యాంటిజెన్ పరీక్షల్లో నెగెటివ్ సీటీస్కాన్లో పాజిటివ్) ఇంకో టీకాతోనూ సత్ఫలితాలు కరోనా వైరస్ నిరోధానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇంకో తొలి విజయం నమోదైంది. భారతీయ సంతతి శాస్త్రవేత్త అమిత్ కాంధార్‌తో కూడిన పీఏఐ లైఫ్ సైన్సెస్ కంపెనీ తయారు చేసిన టీకా ఎలుకలు, కోతులు రెండింటిలోనూ వైరస్ నిర్వీర్యానికి పనికొచ్చే యాంటీబాడీలను ఉత్పత్తి చేసినట్లు స్పష్టమైంది. ఒకే ఒక్క డోసుతో వారీ ఘనతను సాధించినట్లు సైన్స్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్‌లో ప్రచురితమైన పరిశోధన వివరాల ద్వారా తెలిసింది. టీకా ప్రయోగించిన రెండు వారాల్లోనే యాంటీబాడీల ఉత్పత్తి మొదలైందని కంపెనీ వివరించింది. (నిమ్స్ ట్రయల్స్ .. తొలి అడుగు సక్సెస్) -
కార్పొరేట్‌కు దీటుగా ఫలితాలు సాధించాలి
నెల్లూరు సిటీ: కెరీర్ ఫౌండేషన్ కోర్సుల్లో చేరి కార్పొరేట్‌కు దీటుగా విద్యార్థులు ఫలితాలను సాధించాలని మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. వెంగళరావునగర్‌లోని నగరపాలక ఉన్నత పాఠశాలను గురువారం పరిశీలించారు. త్రిపుల్ ఐటీకి పాఠశాల నుంచి ఎంపికైన విద్యార్థి భానుప్రసాద్‌కు రూ.ఐదు వేలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. 415 మంది విద్యార్థులకు గానూ 13 మందే ఉపాధ్యాయులు ఉన్నారని, త్వరలో విద్యావలంటీర్లను నియమించనున్నట్లు చెప్పారు. కార్పొరేటర్లు పెంచలనాయుడు, రాజానాయుడు, పిట్టి సత్యనాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.