
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో ర ఏవంత్ భేటీయ్యారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రిఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జి దీప దాస్ మున్షీ ఉన్నారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు, నామినేటెడ్ పదవులు, కేబినెట్ విస్తరణ, వరంగల్ సభ గురించి ప్రియాంకకు సీఎం వివరించారు. ఈ నెలాఖరున వరంగల్‌లో రైతు రుణమాఫీ విజయోత్సవ బహిరంగసభ నిర్వహిస్తామని ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సభకు ఏఐసీసీ నేతలను ఆహ్వానిస్తున్నారు. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో, రేపు వీరంతా హైదరాబాద్ రానున్నారు.