
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 31న పాలమూరు ప్రజాభేరి పేరుతో కొల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. మాజీ మంత్రి జూపల్లి పార్టీలో చేరిక సందర్భంలోనే ప్రియాంకా గాందీతో కొల్లాపూర్‌లో సభ ఏర్పాటు చేయించాలని భావించినా అప్పుడు సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు ఆమెతో సభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సభ ఏర్పాట్లపై హైదరాబాద్‌లోని మల్లు రవి నివాసంలో జూపల్లి కృష్ణారావు, జగదీశ్వర్‌రావు, ప్రతాప్‌గౌడ్, విజయభాస్కర్‌రెడ్డి ఆదివారం చర్చించారు.
ఈ సందర్భంగా రవి, జూపల్లి, జగదీశ్వరరావు మాట్లాడుతూ పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణలో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ఈ ఎన్నికల్లో విజయాన్ని బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.