రాయ్‌పూర్: లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతూనే ఉంది. ఈ తరుణంలో ఛత్తీస్‌గఢ్‌లోని మనేంద్రగఢ్-చిర్మిరి-భరత్‌పూర్ జిల్లాలోని చిర్మిరి పట్టణంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పర్యటించారు. కోర్బా లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జ్యోత్సానా మహంత్ మద్దతు కోసం జరిగిన ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ, నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని ఆస్తులను బడా బిలియనీర్లకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు.
బీజేపీ దేశంలో రెండు రకాల నాయకులను ప్రోత్సహిస్తోంది. ఇందులో ఒకరు అవినీతిపరులు, మరొకరు ప్రజల సంక్షేమం, సమస్యల గురించి ఏమీ మాట్లాడకుండా ఉండే వారు. ఐదు కేజీల రేషన్ అందించడం ద్వారా ప్రజలను డిపెండెంట్‌గా మార్చాలని బీజేపీ యోచిస్తోంది. దానికి బదులుగా ఉద్యోగాలు పొందటానికి అవకాశాలు సృష్టించాలని ప్రియాంక గాంధీ కోరారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని ఆస్తులను బడా బిలియనీర్లకు ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. దేశంలో ఎలాంటి రాజకీయాలు జరుగుతున్నాయో, దేశంపై ఎలా దాడులు జరుగుతున్నాయో, ఎలాంటి నాయకులను ప్రోత్సహిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలని ప్రియాంక గాంధీ కోరారు.
ధరల పెరుగుదల గురించి బీజేపీ పార్టీ కానీ, ఆ పార్టీ నేతలు కానీ ఏమీ మాట్లాడారు. గత పదేళ్ల నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ తన మేనిఫెస్టోకు ‘న్యాయ్ పాత్ర’ అని పేరు పెట్టిందని ప్రియాంక గాంధీ అన్నారు. బీజేపీ పాలనలో పేద ప్రజలకు తప్పా.. పారిశ్రామికవేత్తలకు, బడా నేతలకు అన్యాయం జరగలేదని ఆమె స్పష్టం చేశారు.
ఛత్తీస్‌గఢ్‌లోని 11 లోక్‌సభ స్థానాల్లో మొదటి రెండు దశల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో నాలుగింటిలో పోలింగ్ జరిగింది. కోర్బాతో సహా మిగిలిన ఏడు స్థానాలకు మే 7న మూడో దశలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment