లక్నో: అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో భాగంగానే అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ తరఫున ప్రచారం చేస్తున్న సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది. ఇప్పుడు భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు.. పాకిస్తాన్ గురించి ఎందుకు చర్చిస్తున్నారు అని అన్నారు. వాస్తవ సమస్యలను గురించి తెలియజేసి ఎన్నికల్లో పోరాడాలని అధికార పార్టీని కోరారు.
ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ హిందూ ముస్లిం అంశంపై వ్యాఖ్యలు చేస్తోందని.. ప్రజలు మతం, కులం ప్రాతిపదికన ఎన్నికలు జరగాలని కోరుకోవడం లేదని ప్రియాంక గాంధీ అన్నారు.
దేశంలో నిరుద్యోగం మాత్రమే కాకుండా.. ద్రవ్యోల్బణం పెరిగిందని అన్నారు. ధరలు పెరగటం వల్ల ప్రజలు నిత్యావరస వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా ఆలోచిస్తున్నారని ప్రియాంక గాంధీ అన్నారు. రైతులు కూడా సరైన జీవనోపాధి లేకుండా బాధపడుతున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment