సాక్షి, జహీరాబాద్: నేటితో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. ఈ క్రమంలో చివరి రోజు పార్టీల నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇక, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ.. జహీరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు.
ఈ సందర్బంగా ప్రియాంక మాట్లాడుతూ.. పదేళ్లలో బీఆర్‌ఎస్ ఏంచేసింది. ప్రశ్నాపత్నాలు లీక్ అయ్యాయి. ధరణితో రైతుల కష్టాలు పెరిగాయి. రుణమాఫీ పూర్తి కాలేదు. ఇచ్చిన హామీలను బీఆర్‌ఎస్ నెరవేర్చలేదు. అధిక ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. బైబై కేసీఆర్.. మార్పు రావాలి. తెలంగాణలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో బీఆర్‌ఎస్ అవినీతి చేసింది. బీఆర్‌ఎస్ అత్యంత ధనిక పార్టీ. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. కర్ణాటకలో మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం.. ఇక్కడ కూడా అమలు చేస్తాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment