
దిస్పూర్ : అధికార బీజేపీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అధికార బీజేపీ దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటుంది. అలా జరిగితే దేశంలోని సామాన్య ప్రజలు ఎక్కువగా నష్టపోతారని అన్నారు. అసోంలోని జోర్హాట్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి గౌరవ్ గొగోయ్‌కు మద్దతుగా ప్రియాంక గాంధీ రోడ్‌షోలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే తేయాకు తోటల కార్మికుల రోజువారీ వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ‘ 2-3 ఏళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేను అస్సాంకు వచ్చి తేయాకు తోటలను సందర్శించినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వేతనాలు పెంచుతానని హామీ ఇచ్చాను. కానీ మీరు బీజేపీని ఎన్నుకున్నారు. వేతనాలు దాదాపు రూ. 250 నుండి పెంచలేదని’ తెలిపారు.
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తేయాకు తోటల కార్మికులకు వేతనాలు పెంచుతామని మా మేనిఫెస్టో హామీ ఇచ్చిందని మరోసారి చెబుతున్నా’ అని ప్రియాంక గాంధీ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment