మేం తప్పుడు హామీలు ఇవ్వం..బీజేపీపై ఖర్గే కామెంట్స్‌ | Mallikarjun Kharge Said Unlike Modi, His Party Does Not Make False Promises | Sakshi
Sakshi News home page

మేం తప్పుడు హామీలు ఇవ్వం..బీజేపీపై ఖర్గే కామెంట్స్‌

Published Sat, Apr 6 2024 6:48 PM | Last Updated on Sat, Apr 6 2024 7:51 PM

Mallikarjun Kharge Said Unlike Modi, His Party Does Not Make False Promises - Sakshi

జైపూర్‌ : ప్రధాని నరేంద్ర మోదీలాగా తమ పార్టీ తప్పుడు వాగ్దానాలు ఇవ్వదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ మేనిఫెస్టో అబద్ధాల పుట్టా అంటూ బీజేపీ విమర్శలు చేస్తోంది. ఆ వ్యాఖ్యలపై ఖర్గే పై విధంగా స్పందించారు.  

జైపూర్‌లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ..‘మా పార్టీ అధికారంలోకి వస్తే 25 హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం. అంతే తప్పా ప్రధాని మోదీలా అబద్ధాలు చెప్పం’ అని అన్నారు  

అయితే నేను మిమ్మల్ని (ప్రజల్ని ఉద్దేశిస్తూ.) ఒకేటే అడగాలనుకుంటున్నాను. బీజేపీ ఎన్నో హామీలు ఇచ్చింది. వాటిల్లో ఇప్పటి వరకు ఎన్ని హామీలను నెరవేర్చింది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అందుకే గత 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చింది. మీకు 20 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా లేదా అంటూ వ్యంగంగా మాట్లాడారు. 

నిరుద్యోగం తగ్గేందుకు బీజేపీ ఏం చేసింది
బీజేపీపై కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఏర్పాటైన దేశంలోని పెద్ద పెద్ద సంస్థలు నిర్వీర్యమయ్యాయని, నేడు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రంపై ప్రజలకు నమ్మకం లేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. దేశంలో నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగం పెరిగిపోతుందని, ఆ నిరుద్యోగాన్ని తగ్గించేందుకు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement